మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా వ్యాపారంలో రాణించాలనుకునే వారికి కీలకమైన సలహా ఇచ్చారు. ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేసిన వీడియోను రీట్వీట్ చేస్తూ ఓ వ్యాపార నైపుణ్యాన్ని ఆయన వివరించారు.
ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేసిన వీడియోలో.. ఓ కుక్క తన ముందు ఉన్న తలుపుకి అద్దం లేకపోయినప్పటికీ .. అక్కడ తాను ముందుకు వెళ్లేందుకు ఏదో అడ్డం ఉందనే భ్రమలో అక్కడే తచ్చాడుతూ ఉంటుంది. కొద్ది సేపటి తర్వాత ఆ కుక్క పక్కన ఉన్న మనిషి తలుపు తీయగానే ఆ కుక్క ముందుకు వెళ్తుంది. అప్పటి వరకు అడ్డేమీ లేకపోయినా... పాత అలవాటు ప్రకారం అక్కడ అద్దం ఉందనే భావనలోనే ఆ కుక్క అక్కడే ఉండిపోతుంది.
ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘మన అలవాట్లు చివరకు మనకు ఎలా వ్యసనంగా మారుతుందో వివరించడానికి ఇంతకు మించిన ఉదాహారణ లేదు. ఈ రోజుల్లో వ్యాపారంలో అతి ముఖ్యమైన నైపుణ్యం ఏంటంటే.. అలవాటైన మూస పద్దతిని బద్దలుకొట్టి స్వేచ్ఛగా ఆలోచించడం అంటూ అద్భుతమైన సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment