ఎన్​ఎస్​ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్​ఔట్​ నోటీసులు..! | CBI Issues Lookout Circular Against Former NSE Head Chitra Ramkrishna | Sakshi
Sakshi News home page

ఎన్​ఎస్​ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్​ఔట్​ నోటీసులు..!

Published Fri, Feb 18 2022 5:19 PM | Last Updated on Fri, Feb 18 2022 5:20 PM

CBI Issues Lookout Circular Against Former NSE Head Chitra Ramkrishna - Sakshi

ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రశ్నించింది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ నియామకం, వెంటనే పదోన్నతులు వంటి విషయాలపై ఆమెను విచారించింది. అయితే, ఈ కేసులో చిత్రా రామకృష్ణతో పాటు ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ రవి నారాయణ్, మాజీ సీఓఓ ఆనంద్ సుబ్రమణియన్ దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండటానికి సీబీఐ లుక్​ఔట్​ నోటీసులు జారీ చేసింది.

ఎన్ఎస్ఈలో అవినీతి, అక్రమాలు పాల్పడినందుకు 2018లోనే ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆమె ఎన్​ఎస్​ఈ సీఈఓగా కొనసాగుతున్న కాలంలో ఒక గుర్తు తెలియని హిమాలయన్ "యోగి" చెప్పినందుకు ఆనంద్‌ సుబ్రమణియన్‌ను ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా నియమించడంతో పాటు సుబ్రమణియన్‌కు ఏడాది కాలంలోనే పదోన్నతులు ఇచ్చినట్లు సెబీ దర్యాప్తులో తేలింది. చిత్ర రామకృష్ణ గత 20 ఏళ్లుగా ఓ 'అదృశ్య' యోగి ప్రభావానికి లోనైనట్లు తెలిసింది. హిమాలయాల్లో ఉండే ఆ యోగితో ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకుని ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఆయన చేతిలో కీలుబొమ్మగా మారి యోగి చెప్పినట్లు నిర్ణయాలు తీసుకున్నారని దర్యాప్తులో వెలుగుచూసింది. 

(చదవండి: చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!)

ఇప్పుడు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తోంది సీబీఐ. స్టాక్ మార్కెట్లో ముందస్తుగా యాక్సెస్ పొందడం ద్వారా లాభాలు పొందడానికి ఎన్ఎస్ఈలో కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చినందుకు ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఓపీజీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని & ప్రమోటర్ సంజయ్ గుప్తా, ఇతరసంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎన్​ఎస్​ఈ సర్వర్ ఆర్కిటెక్చర్​గా పనిచేసే సంజయ్..​ గుర్తు తెలియని అధికారులతో కలిసి కుట్రలో పాలుపంచుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఎన్​ఎస్​ఈ, సెబీకి చెందిన మరికొంతమందిని ప్రశ్నించింది.

(చదవండి: ఈవీ మార్కెట్‌లోకి మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా సూపర్..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement