Chitra Ramkrishna
-
కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్ విచారణ
న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ దాఖలు చేసిన అప్పీలును సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్) విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ సెబీని ఆదేశించింది. అలాగే సెబీ విధించిన రూ. 2 కోట్ల జరిమానా మొత్తాన్ని ఆరు వారాల్లోగా డిపాజిట్ చేయాలని చిత్రా రామకృష్ణను, ఆమెకు చెల్లించాల్సిన రూ. 4.73 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్ రక్షణ నిధి ట్రస్ట్‌లో కాకుండా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీకి సూచించింది. తదుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెడితే, ఎన్ఎస్ఈలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణల్లో చిత్రా రామకృష్ణకు సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్ కింద ఆమెకు దఖలుపడే రూ. 1.54 కోట్లు, అలాగే రూ. 2.83 కోట్ల బోనస్‌ను జప్తు చేసుకుని, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ ట్రస్ట్‌లో జమ చేయాలని ఎన్ఎస్ఈకి సూచించింది. దీనితో పాటు ఈ వివాదంతో సంబంధమున్న మరికొందరిపై కూడా సెబీ జరిమానా విధించడంతో పాటు పలు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ చిత్రా రామకృష్ణ శాట్‌ను ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి. చదవండి: నోట్ల రద్దుతో అలా..భారత్‌పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..! -
NSE Co-Location Scam: 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి చిత్ర రామకృష్ణ..!
ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కుంభకోణం కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణను ఢిల్లీ కోర్టు నేడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి నిచ్చింది. చిత్ర రామకృష్ణ తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారని, దర్యాప్తుకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలియజేసింది. జ్యుడీషియల్ కస్టడీ సమయంలో రామకృష్ణ కోసం ఇంట్లో వండిన ఆహారాన్ని తెచ్చుకునేందుకు న్యాయవాది కోరారు. అయితే, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆహారం కూడా మంచిదని న్యాయమూర్తి చెప్పారు. విచారణ సమయంలో వీఐపీ సౌకర్యాలు కల్పించాలని ఆమె న్యాయమూర్తి కోర్టును కోరారు. దీనిని కూడా కోర్టు తిరస్కరించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో(ఎన్ఎస్ఈ) కో-లొకేషన్ కుంభకోణం కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చిత్రారామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ కొలోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్ఎస్ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్ఎస్ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్ఎస్ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్ చేసింది. (చదవండి: కో-లొకేషన్ కుంభకోణంలో హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు..!) -
'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!!
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ ప్రస్తావించిన ‘అజ్ఞాత యోగి’ గురించి మరిన్ని వివరాలు బైటపడుతున్నాయి. సదరు యోగి పేరిట ఈమెయిల్ ఐడీని సృష్టించినది ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ఆనంద్ సుబ్రమణియన్ అని కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వెల్లడించింది. రుగ్యజుర్సామ @అవుట్‌లుక్‌డాట్‌కామ్ పేరిట క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడీని ఆయనే ఉపయోగించేవారా లేక మరొకరు ఎవరైనా ఆపరేట్ చేసే వారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్యేక సీబీఐ కోర్టుకు తెలిపింది. అలాగే యోగి, చిత్రాకు మధ్య ఈమెయిల్ ద్వారా జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్లో ప్రస్తావనకు వచ్చిన సీషెల్స్ పర్యటనపై కూడా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. చిత్రా సిఫార్సుల మేరకు సుబ్రమణియన్‌ను జీవోవోగా నియమించడం తదితర చర్యల ద్వారా ఎన్ఎస్ఈలో పాలనాపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆమెతో పాటు ఇతరులపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. నిరాకారుడైన ఓ సిద్ధపురుషుడు తనకు పలు అంశాల్లో మార్గదర్శకత్వం చేసే వారంటూ విచారణ సందర్భంగా చిత్రా వెల్లడించడంతో అజ్ఞాత యోగి పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో చిత్రా, తదితరులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు ప్రకటించింది. అటు వివాదాస్పద ఎన్ఎస్ఈ కో–లొకేషన్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, తాజా కేసుపై కూడా విచారణ జరుపుతోంది. చదవండి: మూడు కోట్ల కార్లు..కోటి రూపాయల డైనింగ్ టేబుల్.. చివరికి -
చిత్ర యోగి
-
యోగి సత్యం! మెయిల్ మిథ్య?
national stock exchange Scam: చిత్రా రామకృష్ణ... ఇప్పుడు ఇంటర్నెట్లో అత్యధికులు వివరాలు వెతుకుతున్న పేరు ఇది. దేశవ్యాప్తంగా ఆమె ఇప్పుడు అంత సంచలనం మరి! నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)కి సారథ్యం వహించిన ఓ మనిషి గుర్తుతెలియని ఓ ‘యోగి’ పుంగవుడి ‘మార్గదర్శకత్వం’లో నిర్ణయాలు తీసుకున్నానంటూ చెబితే సంచలనం కాక మరేమవుతుంది! ఎవరి సలహానో, ఏమి సాన్నిహిత్యమో కానీ ‘ఎన్ఎస్ఈ’కి ముక్కూమొహం తెలియని ఆనంద్ సుబ్రమణియన్ అనే వ్యక్తిని తనకు వ్యూహాత్మక సలహాదారుగా, గత జీతం కన్నా పది రెట్లు ఎక్కువకు తీసుకురావడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఏ విషయంలోనూ అంత పట్టు, గ్రహణశక్తి లేని సదరు ఆనంద్ జీతం ఆ పైన మూడు రెట్లు పెరిగి, రూ. 4 కోట్లు ఎలా పెరిగింది? ‘ఎన్ఎస్ఈ’లో జరిగిన గోల్‌మాల్‌పై సెక్యూరి టీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఆదాయపన్ను శాఖ సహా పలు సంస్థలు చేస్తున్న దర్యాప్తుతో డొంకంతా కదులుతోంది. ఆరేళ్ళ క్రితపు చిత్ర ఇ–మెయిల్స్‌ను ‘సెబీ’ తాజాగా బయట పెట్టడంతో ఇన్వెస్టర్లే కాదు... ఇండియా మొత్తం నివ్వెరపోతోంది. అత్యున్నత పదవుల్లోని మేధావులు సైతం మానసిక ప్రశాంతత కోసమో, మరిదేనికో తమకు నచ్చిన ‘గురువు’లనో, ‘గాడ్మన్’లనో ఆశ్రయించడం చరిత్రలో చూస్తున్నదే. అమెరికా లాంటి చోట్లా ప్రఖ్యాత సీఈఓలకూ ఆ ఘన చరిత్ర ఉంది. ప్రఖ్యాత యాపిల్ సంస్థ సహ–వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కూడా ఒక దశలో ఓ భారతీయ గురువు ప్రభావంలో గడిపారు. అయితే, అలాంటి వారి మధ్య ఆ సాన్నిహిత్య వేళ సాగిన సంభాషణలు ఇప్పుడు బయటకొస్తే విచిత్రంగానే అనిపిస్తాయి. చిత్ర ఇప్పుడు ఆ జాబితాకు ఎక్కారు. కాకపోతే, హిమాలయాల్లో సంచరించే నిరాకారుడైన సిద్ధ పురుషుడని ఆమె చెబుతున్న వ్యక్తికి ఇ–మెయిల్ అడ్రస్ ఉండడం, ఆమె కేశశైలి నుంచి అందం, ఆహార్యాలను ఆయన ప్రత్యేకంగా అభినందించడం, ఐహిక బంధం ఉండని ఆ వ్యక్తి ఆమెతో కలసి సేషెల్స్‌కు సేదతీరదామనడం, అతి గోప్యంగా ఉండాల్సిన కార్పొరేట్ సమాచారాన్నీ, సమావేశాల అజెండానూ, పంచవర్ష పురోగమన ప్రణాళికలనూ ఆయనకు ఆమె అందించడమే చిత్రాతిచిత్రం! నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)ను బలంగా నిలబెట్టిన కీలక సభ్యుల్లో ఒకరూ, సాక్షాత్తూ మాజీ సీఈఓ అయిన ఒక వ్యక్తి ఇలాంటి పని చేయడం అంతుపట్టని విషయమే. ‘ఎన్ఎస్ఈ’ని స్థాపించిన 1992 నాటికి చిత్ర ఓ యువ ఛార్టెర్డ్ ఎకౌంటెంట్. ఐడీబీఐలో పనిచేస్తున్న ఆమె తెలివితేటలకు ముచ్చటపడి, ‘ఎన్ఎస్ఈ’కి ఎంపిక చేసిన అయిదుగురి కీలక సభ్యుల్లో ఒకరిగా తీసుకున్నారు. అక్కడ నుంచి ఆమె పురోగతి అనూహ్యం. సరిగ్గా రెండు దశాబ్దాలలో 2013 ఏప్రిల్ నాటికల్లా ‘ఎన్ఎస్ఈ’కి మేనేజింగ్ డైరెక్టర్ – సీఈఓ అయ్యారు. తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందిన చిత్రకు దైవభక్తి, అంతకు మించి అనేక నమ్మకాలు. గత రెండు దశాబ్దాల తన ప్రగతి, ‘ఎన్ఎస్ఈ’ పురోగతికి సదరు అభౌతిక ‘యోగి’ సలహాలే కారణమని ఆమె భావన. వ్యక్తిగత నమ్మకాల మాటెలా ఉన్నా, గోప్యంగా ఉంచాల్సిన కార్పొరేట్ సమాచారాన్ని ఆమె తన గుర్తు తెలియని ‘మార్గదర్శకుడి’కి అన్నేళ్ళుగా ఇ–మెయిల్స్ ద్వారా ఎలా చేరవేస్తున్నారన్నది ప్రశ్న. అసలప్పుడు ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందనేది అర్థం కాని విషయం. ఆనంద్ సహా ఆ యోగి ఎవరై ఉంటారన్నది ఆసక్తికరం. ఆమె నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లకూ, రిటైల్ మదుపరులకూ ఎంత భారీయెత్తున నష్టం వాటిల్లి ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే, ఈ వ్యవహారాన్ని ఆధ్యాత్మికతగా కన్నా ఆర్థిక మోసంగానే అత్యధికులు భావిస్తున్నారు. దేశంలో ఆర్థిక సరళీకరణ మొదలైన ఏడాదికే 1992 ఏప్రిల్‌లో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం బయటపడింది. సాంకేతికత, పారదర్శకత నిండిన ఆధునిక స్టాక్ ఎక్స్ఛేంజ్ అవసర మని అప్పట్లో సర్కారు గుర్తించడంతో ‘ఎన్ఎస్ఈ’ ఆవిర్భవించింది. తీరా అక్కడా అనేక అక్రమాలే నని ఇప్పుడు తేలింది. ఆధునిక భారతావనికి ప్రతీకగా, ప్రపంచంలోని అతి పెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ లలో ఒకదానికి మూడున్నరేళ్ళు సారథ్యం వహించిన మహిళాశక్తిగా నీరాజనాలు అందు కున్న చిత్ర ఇలా అట్టడుగుకు జారిపోవడం విషాదమే. స్టాక్ బ్రోకర్లైన కొందరికి అనుచిత సాయం చేశారంటూ వచ్చిన ఆరోపణలతో 2016 డిసెంబర్లో ఆమె తన పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లోనే ఆమె తప్పులు, అక్రమాల గురించి తెలిసినా సరే, ‘ఎన్ఎస్ఈ’ బోర్డు నోరు విప్పలేదు. సెబీకి చెప్పలేదు. ప్రశంసిస్తూనే, సాగనంపింది. అందుకు హేతువేమిటో అర్థం కాదు. కరోనా తర్వాత మార్కెట్ పుంజుకుంటోదని భావిస్తున్న వేళ ఈ కథ ఇప్పుడే ఎందుకు బయటకొచ్చిందో తెలీదు. అవినీతి, అక్రమాలు, కార్పొరేట్ నిర్వహణలో తప్పులు, అంతుచిక్కని అనుబంధాలతో కూడిన చిత్ర ఉదంతం అచ్చంగా ఓ వెబ్‌సిరీస్. ఇంత జరుగుతుంటే, స్టాక్ ఎక్స్ఛేంజ్ను నియంత్రించాల్సిన ‘సెబీ’ కుంభకర్ణ నిద్ర పోతోందా? ఈ కథలో చిత్ర అమాయకంగా ఎవరి చేతిలోనో మోసపోయారా, లేక ఆర్థిక అక్రమాల బృహత్ప్రణాళికలో ఆమె కూడా ఓ భాగమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబు తెలియాలి. ఇప్పటికైనా ‘ఎన్ఎస్ఈ’లో ఏం జరిగిందో లోతుగా దర్యాప్తు చేయాలి. ఈ వ్యవస్థాగత వైఫల్యంలో తెర వెనుక బండారాన్ని బయటకు తీయాలి. నమ్మకంతో కోట్లాది రూపాయలు విపణిలో పెట్టే అమాయక మదుపరుల ఆర్థిక క్షేమంపై అనుమానాలు ప్రబలుతున్న వేళ అది అత్యంత కీలకం. విచిత్ర మానసిక స్థితితో ‘యోగి సత్యం... మెయిల్ మిథ్య’ అని కూర్చుంటేనే కష్టం! -
ఎన్ఎస్ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్ఔట్ నోటీసులు..!
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రశ్నించింది. ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్ నియామకం, వెంటనే పదోన్నతులు వంటి విషయాలపై ఆమెను విచారించింది. అయితే, ఈ కేసులో చిత్రా రామకృష్ణతో పాటు ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ రవి నారాయణ్, మాజీ సీఓఓ ఆనంద్ సుబ్రమణియన్ దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండటానికి సీబీఐ లుక్ఔట్ నోటీసులు జారీ చేసింది. ఎన్ఎస్ఈలో అవినీతి, అక్రమాలు పాల్పడినందుకు 2018లోనే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమె ఎన్ఎస్ఈ సీఈఓగా కొనసాగుతున్న కాలంలో ఒక గుర్తు తెలియని హిమాలయన్ "యోగి" చెప్పినందుకు ఆనంద్ సుబ్రమణియన్‌ను ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించడంతో పాటు సుబ్రమణియన్‌కు ఏడాది కాలంలోనే పదోన్నతులు ఇచ్చినట్లు సెబీ దర్యాప్తులో తేలింది. చిత్ర రామకృష్ణ గత 20 ఏళ్లుగా ఓ 'అదృశ్య' యోగి ప్రభావానికి లోనైనట్లు తెలిసింది. హిమాలయాల్లో ఉండే ఆ యోగితో ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకుని ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఆయన చేతిలో కీలుబొమ్మగా మారి యోగి చెప్పినట్లు నిర్ణయాలు తీసుకున్నారని దర్యాప్తులో వెలుగుచూసింది. (చదవండి: చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!) ఇప్పుడు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తోంది సీబీఐ. స్టాక్ మార్కెట్లో ముందస్తుగా యాక్సెస్ పొందడం ద్వారా లాభాలు పొందడానికి ఎన్ఎస్ఈలో కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చినందుకు ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఓపీజీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని & ప్రమోటర్ సంజయ్ గుప్తా, ఇతరసంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎన్ఎస్ఈ సర్వర్ ఆర్కిటెక్చర్‌గా పనిచేసే సంజయ్.. గుర్తు తెలియని అధికారులతో కలిసి కుట్రలో పాలుపంచుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఎన్ఎస్ఈ, సెబీకి చెందిన మరికొంతమందిని ప్రశ్నించింది. (చదవండి: ఈవీ మార్కెట్లోకి మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా సూపర్..!) -
చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!
ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ రోజు రోజుకి మరింత కష్టాల్లో చిక్కుకుంటున్నారు. మరోసారి చిత్రా రామకృష్ణ నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ఆదాయపన్ను, సెబీ సంస్థల విచారణలో చిత్రా రామకృష్ణ ఉన్నారు. ఆమె ఎన్ఎస్ఈ మాజీ సీఈఓగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీనికి తోడు అజ్ఞాత యోగితో చిత్ర జరిపిన ఈ-మెయిల్ సంభాషణలు తాజాగా బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు, ఎవరు ఈమె?, చిత్రా రామకృష్ణపై ఆదాయపన్ను& సెబీ సంస్థలు ఎందుకు విచారణ చేపడుతున్నాయి? అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. చిత్ర రామకృష్ణ ఎవరు? చార్టెడ్ అకౌంటెంట్‌గా జీవితం ప్రారంభించిన చిత్రా రామకృష్ణ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన ప్రాజెక్ట్ ఫైనాన్స్ డివిజన్లో చేరారు. చిత్ర రామకృష్ణ కాలక్రమేణా ఒక్కో మెట్టు ఎక్కుతూ 2009లో ఎన్ఎస్ఈకి మేనేజింగ్ డైరెక్టర్(ఎండి)గా నియామకం కావడం జరిగింది. ఆ తర్వాత 2013లో ఎన్ఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఈఓ) పదివి చేపట్టి 2016 వరకు కొనసాగారు. చిత్ర రామకృష్ణ కెరీర్ హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత ఓ పారదర్శక ట్రేడింగ్ మార్కెట్ నిర్వహించాలని కేంద్రం భావించింది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ఏర్పాటు చేసింది. అందులో ఈమె కీలక సభ్యురాలిగా కొనసాగారు. అక్కడి నుంచి సీఐఐ నేషనల్ కౌన్సిల్ ఆన్ ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్ మెంట్, ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, క్యాపిటల్ మార్కెట్స్ కమిటీ వంటి ఇండస్ట్రీ బాడీ కమిటీల్లో కూడా రామకృష్ణ పని చేశారు. ఆ తర్వాత ఆమె 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్'గా నియమితులయ్యారు. 2013లో ఆమె సీఈఓగా పదోన్నతి పొందింది. 2016లో అనూహ్యంగా ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. బోర్డు సభ్యులతో అభిప్రాయ భేదాల కారణంగానే తన పదివికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్ర రామకృష్ణ పతనం 2016లో అనూహ్యంగా ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి తొలగిన తర్వాత ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. చిత్ర గత 20 సంవత్సరాలుగా వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలలో హిమాలయాల్లో నివసిస్తున్న ఒక 'యోగి' తనకు మార్గనిర్దేశం చేసినట్లు చెప్పారు. అజ్ఞాత యోగితో చిత్ర జరిపిన ఈ- మెయిల్ సంభాషణలు సెబీ దర్యాప్తులో బయటకు వచ్చాయి. అలాగే, ఆనంద్ సుబ్రమణియన్'ను ప్రధాన వ్యూహాత్మక సలహాదారుగా నియమించడంలోను ఆమెపై ఆరోపణలు వచ్చాయి. హిమాలయన్ 'యోగి' చెప్పినందుకే అతనిని నియమించుకున్నట్లు సీబిఐ దర్యాప్తులో తేలింది. పాలనపరమైన విషయంలో కూడా రామకృష్ణ, బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ విషయం వెల్లడైంది. దర్యాప్తులో రామకృష్ణ హిమాలయన్ 'యోగి' గురించి చెబుతూ తనకు రూపం లేదని, తను ఒక ఆధ్యాత్మిక శక్తిగా చెప్పినట్లు సెబీ పేర్కొంది. పాలనా లోపాల విషయంలో సెబీ రామకృష్ణపై రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈ మాజీ ఎండి సుబ్రమణియన్, సీఈఓ రవి నరైన్ లపై ఒక్కొక్కరికి రూ.2 కోట్లు, చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్, కాంప్లయన్స్ ఆఫీసర్'గా ఉన్న వి.ఆర్.నరసింహన్ కు రూ.6 లక్షలు జరిమానా విధించింది. ఇంకా, రామకృష్ణ & సుబ్రమణియన్లను ఏ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో లేదా సెబీతో రిజిస్టర్ చేసుకున్న సంస్థతో కలిసి పనిచేయకుండా 3 సంవత్సరాల పాటు నిషేదించింది. అలాగే, నరైన్ కు కూడా 2 సంవత్సరాలు నిషేదించింది. అయితే, సెబీ దర్యాప్తులో హిమాలయన్ 'యోగి' ఒక వ్యక్తి అని తేలింది. మరి అతను ఎవరు అనేది ఆనంద్ సుబ్రమణియన్'కు తెలిసి ఉంటుంది అని భావిస్తుంది. (చదవండి: వీరేంద్ర సెహ్వాగ్, భువనేశ్వర్ కుమార్ భాటలో ఆరోన్ ఫించ్..!) -
గుడ్‌బై చెప్పిన మొదటి మహిళ అధినేత!
-
ఎన్ఎస్ఈ సీఈఓగా వైదొలిగిన చిత్ర రామకృష్ణ
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)ఎండీ, సీఈఓగా చిత్ర రామకృష్ణ అనూహ్యమైన పరిస్థితుల్లో వైదొలిగారు. 1992లో ఎన్ఎస్ఈ ఏర్పడినప్పటి నుంచి వివిధ హోదాల్లో ఆమె సేవలందించారు. త్వరలో రానున్న ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) విషయంలో బోర్డు సభ్యులతో ఏర్పడిన విభేదాల వల్లే ఆమె తన పదవి నుంచి వైదొలిగారని సమాచారం. షెడ్యూల్ ప్రకారమైతే, ఆమె పదవీ కాలం 2018 మార్చి వరకూ ఉంది. ఎన్ఎస్ఈ మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే ఆమె వైదొలిగినట్లు తెలియజేసింది. ‘‘చిత్ర రాజీనామాను బోర్డ్ ఆమోదించింది. ఎన్ఎస్ఈ పురోభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారు. పదవిలో కొంత కాలం కొనసాగాలని బోర్డ్ ఆమెను అభ్యర్థించినా... ఆమె మాత్రం తక్ష ణం వైదొలగాలని నిర్ణరుుంచుకున్నారు. అందుకని ఎన్ఎస్ఈ తాత్కాలిక సీఈఓగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవిచంద్రన్ వ్యవహరిస్తారు’’ అని ఎన్ఎస్ఈ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. 1992లో ఎన్ఎస్ఈ ఏర్పాటైనప్పటినుంచి వివిధ హోదాల్లో చిత్ర రామకృష్ణ పనిచేశారు. 2013, ఏప్రిల్‌లో ఆమె ఎండీ, సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రవి నారాయణ్ స్థానంలో ఆమె వచ్చారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్సేంజేస్‌కు చైర్‌పర్సన్‌గా గతనెలలోనే ఎంపికయ్యారు. ఎన్ఎస్ఈ హెడ్‌గా పనిచేసిన మూడో వ్యక్తి చిత్ర. కాగా రవి నారాయణ్‌తో ఆమెకు ఏర్పడిన విభేదాలే ఈ రాజీనామాకు కారణమని అనధికారిక వర్గాల సమాచారం. -
గుడ్‌బై చెప్పిన మొదటి మహిళ అధినేత!
దేశీయంగా అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా పేరున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు మొదటి మహిళా మేనేజింగ్ డైరెక్టర్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్రా రామకృష్ణ ఆమె పదవికి గుడ్ బై చెప్పారు. చిత్రా రామకృష్ణ తన పదవి నుంచి దిగిపోయినట్టు బోర్డులోని సంబంధిత వర్గాలు చెప్పాయి. రోజువారీ కార్యకలాపాల కోసం తాత్కాలికంగా రామకృష్ణ స్థానంలో జే రవిచంద్రన్‌ను ఎన్ఎస్ఈ నియమించింది. ఆయన ప్రస్తుతం గ్రూప్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిత్రా రామకృష్ణ రాజీనామా విషయాన్ని ఎన్ఎస్ఈ త్వరలోనే స్టామ్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి వెల్లడించనుంది. ఆమె వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది. ఎన్ఎస్ఈకి తొలి మహిళ అధినేతగానే కాక, ఇటీవలే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజస్(డబ్యూఎఫ్ఈ)కి మొదటి మహిళా చైర్‌గా కూడా ఆమె ఎంపికయ్యారు. డబ్యూఎఫ్ఈ ప్రపంచవ్యాప్తంగా 45వేల లిస్టెడ్ కంపెనీలకు అసోసియేషన్ గా ఉంటోంది. ఎన్ఎస్ఈకి తొలి మహిళా అధినేతగా ఆమె ఆ పదవిలో 2013 ఏప్రిల్ నుంచి కొనసాగుతున్నారు. 2009 నుంచి 2013 వరకు ఎక్స్చేంజ్కు చిత్రా రామకృష్ణన్ జాయింట్ ఎండీగా పనిచేశారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, లిస్టింగ్ హెడ్‌గా కూడా ఆమె సేవలందించారు. ఎన్ఎస్ఈ ఏర్పాటుచేసిన స్టార్టప్ టీమ్ లో రామకృష్ణన్ ఓ భాగంగా ఉన్నారు. అయితే ఆమె వైదొలగడం ఎన్ఎస్ఈ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మెంబర్ దీపన్ మెహతా చెప్పారు. -
ఈటీఎఫ్‌లపై ఎన్ఎస్ఈ దృష్టి
ముంబై: రిటైల్ ఇన్వెస్టర్లను భారీ సంఖ్యలో ఆకట్టుకోవాలంటే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)పై ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉన్నదని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) భావిస్తోంది. తద్వారా ఈక్విటీలలో పెట్టుబడులవైపు రిటైలర్లను మరింత ఆకర్షించవచ్చునని ఎన్ఎస్ఈ సీఈవో చిత్రా రామకృష్ణన్ పేర్కొన్నారు. వీటితోపాటు ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర బాండ్లను కూడా రిటైలింగ్‌లోకి తీసుకురావాల్సి ఉన్నదని చెప్పారు. మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లను మరింత విస్తరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఫండ్స్‌లాగే... ఈటీఎఫ్‌లు కూడా మ్యూచువల్ ఫండ్స్‌ను పోలి ఉంటాయి. వివిధ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్చేయడంతోపాటు, వీటికి సంబంధించిన యూనిట్లను జారీ చేస్తాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా వీటిలో క్రయవిక్రయాలను నిర్వహించుకోవచ్చు. అయితే ఇందులో రెండు రకాలుంటాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు, సంపన్న వర్గాల వంటివారికి రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఈటీఎఫ్‌లను రూపొందించాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రం సులభతరంగా ఉండే విధంగా వీటిని తీర్చిదిద్దాలని చిత్ర వివరించారు. ఒక స్టాక్ ఎక్స్ఛేంజీగా రెండు రకాల ఇన్వెస్టర్లకూ వినియోగపడేలా ఉత్పత్తులను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనిలో భాగంగా త్వరలో 10ఏళ్ల కాలపరిమితిగల ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించిన ఇంటరెస్ట్ రేట్ ఫ్యూచర్స్(ఐఆర్ఎఫ్)లో లావాదేవీలను నిర్వహించేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పించనుంది. ఈటీఎఫ్‌లలో పెట్టుబడులకు సంబంధించి ఖర్చులు తక్కువగా ఉండటమేకాకుండా ఫండ్ పనితీరును రోజువారీ గమనించాల్సిన పనిఉండదని చిత్ర వివరించారు. దీంతోపాటు ఒకే ఈటీఎఫ్ ద్వారా పలు షేర్లలో ఇన్వెస్ట్‌చేసేందుకు అవకాశముంటుందని వివరించారు. -
ఫార్చూన్ పవర్ జాబితాలో నలుగురు భారత మహిళలు
న్యూయార్క్: ఫార్చ్యూన్ మ్యాగజైన్ రూపొందించిన అంతర్జాతీయ అగ్రశ్రేణి 50 మహిళా వ్యాపార వేత్తల జాబితాలో నలుగురు భారత మహిళలకు స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చిత్రా రామకృష్ణ(17 వ స్థానం), యాక్సిస్ బ్యాంక్ శిఖా శర్మ(32వ స్థానం), హెచ్ఎస్బీసీ నైనా లాల్ కిద్వాయ్(42వ స్థానం)లో ఉన్నారు. గత ఏడాది జాబితాలో ఐదో స్థానంలో ఉన్న కొచర్ ఈ ఏడాది జాబితాలో ఒక స్థానం మెరుగై నాలుగో స్థానానికి ఎగబాకారు. ఎన్ఎస్ఈ చీఫ్ చిత్రా రామకృష్ణన్ తొలిసారిగా ఈ జాబితాలో చోటు సాధించారు. ఈ జాబితాలో తొలి స్థానాన్ని బ్రెజిల్‌కు చెందిన ఇంధన దిగ్గజం పెట్రోబాస్ సీఈవో మరియా దాస్ గ్రేకాస్ ఫోస్టర్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో టర్కీకి చెందిన సుబాన్సి హోల్డింగ్స్ గులేర్ సుబాన్సి, ఆస్ట్రేలియా బ్యాంక్ దిగ్గజం, వెస్ట్‌ప్యాక్ సీఈవో గెయిల్ కెల్లీ ఉన్నారు. ఇక అమెరికాకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఏడాది టాప్ 50 శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి తన రెండో స్థానాన్ని ఈ ఏడాది కూడా నిలుపుకున్నారు. మొదటి స్థానంలో ఐబీఎం గిన్ని రొమెట్టీ, మూడో స్థానంలో డ్యుపాంట్ ఎల్లెన్ కుల్మన్లు ఉన్నారు. కంపెనీ పరిమాణం, అంతర్జాతీయంగా ఆ కంపెనీ నిర్వహిస్తున్న వ్యాపారం ప్రాముఖ్యత, ఆ వ్యక్తి వ్యాపార కెరీర్, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు తదితర అంశాల ఆధారంగా ఆ జాబితాను రూపొందించామని ఫార్చ్యూన్ మ్యాగజైన్ పేర్కొంది. చందా కొచర్ ఐసీఐసీఐ 4వ ర్యాంక్ చిత్రా రామకృష్ణన్ ఎన్ఎస్ఈ 17 శిఖా శర్మ యాక్సిస్ బ్యాంక్ 32 నైనాలాల్ కిద్వాయ్ హెచ్ఎస్బీసీ 42 -
నాలుగో స్థానంలో చందా కొచ్చర్
న్యూయార్క్: ప్రపంచ వాణిజ్య రంగంలో అత్యంత శక్తిమంతుల జాబితాలో నలుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. ఫార్చ్యూన్ మేగజీన్ తాజాగా ప్రకటించిన బిజినెస్ వుమెన్ లీడర్స్ టాప్-50 జాబితాలో ఆమె నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. గతేడాది పోలిస్తే కొచ్చర్ ఒక స్థానం మెరుగు పరుచుకున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చిత్రా రామకృష్ణ 17వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో చిత్రకు తొలిసారిగా స్థానం దక్కింది. ఏక్సిక్ బ్యాంక్‌కు చెందిన శిఖా శర్మ 32, హెచ్ఎస్బీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నైనా లాల్ కిద్వాయ్ 42 స్థానాల్లో నిలిచారు. బ్రెజిల్ ఇంధన కంపెనీ పెట్రోబ్రాస్ సీఈవో మారియా దాస్ గ్రాకస్ ఫోస్టర్ అగ్రస్థానం దక్కించుకున్నారు. అమెరికా తరపున రూపొందించిన ఇదే జాబితాలో భారత నేపథ్యం కలిగిన పెప్సికో ఇండియా చీఫ్ ఇంద్రా నూయి రెండో స్థానంలో ఉన్నారు.