న్యూఢిల్లీ: అంతర్జాతీయ సోలార్ రంగంలో కార్పొరేట్ ఫండింగ్ గతేడాది మొదటి తొమ్మిది నెలల్లో 13 శాతం తగ్గింది. 24.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు మెర్కామ్ క్యాపిటల్ తన నివేదికలో పేర్కొంది. 2021లో ఇదే కాలంలో 27.8 బిలియన్ డాలర్లు వచ్చినట్టు తెలిపింది. వెంచర్ క్యాపిటల్, ప్రైవేటు ఈక్విటీ (వీసీ, పీఈ), డెట్ ఫైనాన్స్, పబ్లిక్ మార్కెట్ ఫండింగ్‌ను కార్పొరేట్ ఫండింగ్‌గా చెబుతారు. 2021తో పోలిస్తే గతేడాది వీసీ పెట్టుబడులు 56 శాతం పెరిగి 7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డెట్ ఫైనాన్స్ 24 శాతం తగ్గి 12 బిలియన్ డాలర్లుగా ఉంది.
పబ్లిక్ మార్కెట్ ఫైనాన్స్ 5.1 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో వచ్చిన 7.5 బిలియన్ డాలర్లతో పో లిస్తే 32 శాతం తక్కు వ. అంతర్జాతీయంగా సోలార్ రంగంలో 2022లో మొత్తం 128 విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు జరిగాయి. ‘‘ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలో డిమాండ్ పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యం ఈ రంగానికి మద్దతుగా నిలిచింది. సోలార్ ప్రాజెక్టుల కొనుగోళ్ల పరంగా 2022 ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో వీసీ, పీఈ పెట్టుబడులు వచ్చాయి’’ అని మెర్కామ్ క్యాపిటల్ గ్రూపు సీఈవో రాజ్ ప్రభు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment