ముంబై: గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈ వారం నష్టాలతో ఆరంభమైంది. యుద్ధం ఎఫెక్ట్‌తో గత వారం స్టాక్ మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో షేర్లు కనిష్టాల వద్ద లభిస్తుండటంతో వారాంతంలో భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే అది ఎక్కువ కాలం కొనసాగలేదు. సోమవారం ఉదయం మార్కెట్ ఆరంభం కావడంతోనే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు నష్టాల బాట పట్టాయి.
ఉదయం 10 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 55121 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఉదయం 9:38 గంటల సమయంలో అయితే 900ల పాయింట్లకు పైగా నష్టపోయి 55 మార్క్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత కోలుకుంది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 265 పాయింట్లు నష్టపోయి 16,392 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మార్కెట్ ప్రారంభమైన గంట వ్యవధిలో నిఫ్టీ 1.59 శాతం క్షీణించడగా సెన్సెక్స్ 1.42 శాతం క్షీణించింది. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా ఏషియన్ పేయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment