
ముంబై : నవరంబర్ చివరి వారంలో చోటు చేసుకున్న పరిస్థితులే మరోసారి స్టాక్ మార్కెట్‌లో పునరావృతం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సూచీలతో పోటీ పడుతూ దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చేస్తున్నాయి. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లో భారీ నష్టాలు నమోదు అవుతున్నాయి. ఉదయం 10:20 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 461 పాయింట్లు నష్టపోయి 59,002 దగ్గర ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 117 పాయింట్లు నష్టపోయి 17,639 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
ఉద్రిక్తతలు
ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య తలెత్తిన ఉద్రిక్తలు, ఒమిక్రాన్ వ్యాప్తి, క్రూడ్ ఆయిల్ రేట్ల పెంపు తదితర కారణాలతో స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలపాలయ్యింది. మొన్నటి వరకు ఫెడ్ రిజర్వ్ రేట్ల పెంపు సానుకూల ఫలితాలు మార్కెట్‌లో ఇవ్వగా తాజాగా అమెరికాలో నిరుద్యోగ రేటు పెరగడం ద్రవ్యోల్బం అందుకు తోడవటం ప్రతికూల ప్రభావం చూపింది.
భారీ నష్టం
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ రోజు 59,039 పాయింట్ల దగ్గర మొదలవగా ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. కేవలం గంట వ్యవధిలోనే 650 పాయింట్లకు పైగా నష్టపోంది. దీంతో లక్షల కోట్ల రూపాయల మార్కెట్ సంపద ఆవిరైంది. నిఫ్టీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అనంతం ఉదయం 10 గంటల తర్వాత మరోసారి ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించినా... అది క్షణకాలమే అనే పరిస్థితి నెలకొంది. సాయంత్రం మార్కెట్ ముగిసే సరికి ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు తప్పవనే అంచనాలు నెలకొన్నాయి. బుధ, గురువారాల్లో దేశీ సూచీలు భారీగా నష్టపోవడంతో సుమారు 7 లక్షల కోట్లకు పైగానే ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఈ వారం మార్కెట్‌కి చివరి రోజు కూడా భారీ నష్టాలు చోటు చేసుకుంటే మరింత నష్టం తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment