దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో పెట్రోలా ధర సెంచరీ కూడా కొట్టేసింది. రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఈ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజు రోజుకి అక్కడ పెరిగిపోతుంది. మన దేశంలో కూడా ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరిగింది.
గత రెండు నెలల్లోనే ఈ సైకిళ్ల అమ్మకాలు 10 నుంచి 15 శాతం వరకూ పెరిగినట్లు అవాన్ సైకిల్స్ ఎండీ తెలిపారు. వచ్చేవారం నుంచి ఈ బైక్స్ ఉత్తరాదిలో కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మెట్రో నగరాల్లో భారీగా పెరుగుతున్న ట్రాఫిక్ కూడా ఈ బైక్ విక్రయాలు పెరగడానికి ఒక కారణంగా తెలుస్తోంది. త్వరలో ఈ బైక్స్ అమ్మకాల్లో వంద శాతం వృద్ధిని అందుకుంటామని హీరో సైకిల్స్ అంచనా వేస్తోంది. మరోవైపు గత 2-3 నెలలుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు ఎలక్ట్రిక్ వాహన సంస్థలు తెలిపాయి. ఇంట్లో అవసరాలకు కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు అనువుగా ఉండటమే కాకుండా పెట్రోల్ నుంచి విముక్తి పొందడంతో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment