గూగుల్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్‌గా 'ప్రభాకర్ రాఘవన్' నియమితులైనట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. గత 12 సంవత్సరాలుగా కంపెనీకి సేవలందిస్తున్న రాఘవన్.. గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్ వంటి వాటికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఎవరీ ప్రభాకర్ రాఘవన్?
భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రభాకర్ రాఘవన్ 1981లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత 1982లో శాంటా బార్బరాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. 1986లో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు.
2012లో ప్రభాకర్ రాఘవన్ గూగుల్‌లో చేరారు. అంతకంటే ముందు ఈయన యాహూలో పనిచేశారు. యాహూ నుంచి గూగుల్‌లో చేరిన తరువాత సెర్చ్ అండ్ యాడ్ ర్యాంకింగ్‌తో పాటు యాడ్ మార్కెట్‌ప్లేస్ డిజైన్‌లో పనిచేశారు. ఆ తరువాత గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్లలోనూ పనిచేసారు. ఈ సమయంలోనే ఈయన స్మార్ట్ రిప్లై అండ్ స్మార్ట్ కంపోజ్ వంటి ఏఐ ఫీచర్స్ ప్రారంభిచడంలో కీలకపాత్ర పోషించారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..
ప్రభాకర్ రాఘవన్ వివిధ విభాగాల్లో పనిచేస్తూ 2018లో గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్, పేమెంట్స్ ప్రొడక్ట్‌ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాఘవన్ నాయకత్వంలోనే ఏఐ ఓవర్‌వ్యూస్, సర్కిల్ టు సెర్చ్, లెన్స్‌లో మీరు చూసే వాటిని షాపింగ్ చేయండి వంటి ఫీచర్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పుడు ఈయన గూగుల్ చీఫ్ టెక్నాలజిస్ట్‌గా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment