
ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి రోజుకు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తుంది. కొద్ది రోజుల ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్, సింపుల్ ఎనర్జీ వన్ ఈవి వచ్చి ఒక ట్రెండ్ సృష్టించాయి. తాజాగా ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వేహికల్ స్టార్టప్ ఈబైక్ గో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆగస్టు 25న దేశంలోకి అమ్మకానికి రాబోతున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ శక్తివంతమైనది అని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ ప్రారంభించిన రోజున మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.(చదవండి: మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!)
"ఈ బైక్ గోను మార్కెట్లోకి తీసుకొనిరావడానికి మూడు ఏళ్లు పట్టింది. ప్రజలను ఆకర్షించే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాము. పరిశ్రమలో బహుళ ఓఈఎంలు తీసుకొచ్చిన వాహనాలను చూసిన తర్వాత దీనిని తీసుకొస్తున్నట్లు" ఈబైక్ గో వ్యవస్థాపకుడు సీఈఓ ఇర్ఫాన్ ఖాన్ చెప్పారు. ఈబైక్ గో ద్వారా రాబోయే ఈవి భారతదేశంలో పూర్తిగా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఐసీఎటి) కూడా ఆమోదించినట్లు తెలిపారు. ఇది భారతదేశంలో ఈ-మొబిలిటీ గమనాన్ని మారుస్తుంది అని ఖాన్ అన్నారు.