ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారతదేశంలో కఠినమైన భద్రతా నిబంధనల అమలు అవసరాన్ని ఎత్తిచూపుతూ ఇటీవల మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలి పోయింది. ఈ సంఘటన ముంబైలోని అంధేరిలో జరిగింది. ప్రముఖ సహారా గ్రూప్ కంపెనీ సహారా ఏవోల్స్ కి చెందిన ఎక్స్1- ఎలక్ట్రిక్ స్కూటర్. సహారా ఏవోల్స్ కంపెనీ జూన్ 2019లో ఈ స్కూటర్ ఎక్స్-1ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్-1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ.80,000 వరకు ఉంది.
దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల దూరం వెళ్లనుంది. 250 వాట్ మోటార్ చేత ఇది పనిచేస్తుంది. ఈ స్కూటర్ 1.9 కెడబ్ల్యుహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇలాంటి సంఘటనలు జరగడం ఇది మొదటి సారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో ప్యూర్ ఈవీకి చెందిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగితే, ఆ తర్వాత ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకదాని నుంచి మంటలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుంది.
(చదవండి: దిగ్గజ టెక్ కంపెనీలను వణికిస్తున్న "లాగ్4జే" లోపం)
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ తన 13(ప్రపంచ వ్యాప్తంగా) కాంపాక్ట్ క్రాస్ఓవర్ కోనా ఎలక్ట్రిక్ కారులలో అగ్ని ప్రమాదాలు సంబంధించిన తర్వాత 82000 ఈవిలను రీకాల్ చేసింది. అందులో భారతదేశంలో విక్రయించిన 456 యూనిట్ల కార్లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలలో కదిలే భాగాల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండటంతో ఈవిలు ఉత్పత్తి చాలా తేలిక. అయినప్పటికీ, ఇందులో బ్యాటరీ, మోటార్ చాలా ముఖ్యమైనవి. మరి ముఖ్యంగా చెప్పాలంటే, వాహనం మొత్తం భద్రత బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ సమర్థతపై ఆధారపడి ఉంటుంది.
బ్యాటరీ ఎంత వేగంగా చల్లబడుతుంది, ఎంత వేగంగా చార్జ్ అవుతుంది అనేది ప్రస్తుతం చాలా ముఖ్యం. భారతదేశంలో ఎక్కువ శాతం లిథియం అయాన్ బ్యాటరీ ముడిపదార్ధాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటాయి. మరి కొన్ని కంపెనీలు ఏకంగా చైనా నుంచి లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవడంతో ఇలాంటి ఘటనలు జరుగతున్నాయి. "భారతీయ ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు ముఖ్యంగా బ్యాటరీల కోసం దిగుమతులపై ఆధారపడుతున్నాయి. కాబట్టి, భద్రతా సంబంధిత సంఘటనలను నివారించడానికి ఒక యంత్రాంగాన్ని ఉంచాల్సిన అవసరం ఉంది" అని ఐహెచ్ఎస్ మార్కిట్ అసోసియేట్ డైరెక్టర్ సూరజ్ ఘోష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment