సాక్షి, ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్, ఈవీ మేకర్ టెస్లా బాస్ ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ మద్దతిస్తున్న ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీకి షాకివ్వనున్నారు. చాట్ జీపీటీకి పోటీగా తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఏర్పాటు కసరత్తు చేస్తున్నాడు.
ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నాడు. టెస్లా, ట్విటర్ చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు, ఇంజనీర్ల టీంతో సంప్రదింపులు జరుపుతున్నాడు. అలాగే తన కొత్త వెంచర్‌లో సంభావ్య పెట్టుబడులకు సంబంధించి స్పేస్‌ఎక్స్ ,టెస్లా నుండి అనేక మంది పెట్టుబడి దారులతో చర్చలు జరుపుతున్నట్లు నివేదిక పేర్కొంది. (పనిమనుషులకు హెలికాప్టర్‌లో ఐలాండ్ ట్రిప్, వైరల్ వీడియో)
వినియోగదారులనుంచి కించపరిచే టెక్స్ట్‌ను ఉత్పత్తి చేయకుండా ChatGPTని నిరోధించేలా రక్షణలను ఇన్‌స్టాల్ చేస్తోందంటూ పదేపదే విమర్శిస్తున్న మస్క్. కనీసం ఆరు నెలల పాటు ఏఐ వ్యవస్థలను నిలిపివేయాలని పిలుపునిస్తూ బహిరంగ లేఖపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సరికొత్త ఏఐ సంస్థను ప్రకటించేందుకు సన్నద్ధమవు తున్నట్టు తెలుస్తోంది.
నెవాడా వ్యాపార రికార్డుల ప్రకారం, మస్క్ మార్చి 9న ఎక్స్.ఏఐ కార్ప్ (X.AI Corp) రిజిస్టర్ చేశాడు. ఈ కొత్త కంపెనీలో ఏకైక డైరెక్టర్‌గా మస్క్ ఉండబోతున్నారు. దీనికి సంబంధించి శాస్త్రవేత్త ఇగోర్ బాబూస్కిన్‌తో సహా ఇద్దరు మాజీ పరిశోధకులను నియమించాడట. ప్రస్తుతానికి ఎక్స్.ఏఐ కార్ప్ అధికారిక వివరాలు వెల్లడికాన్నప్పటికీ, ‘సత్యాన్ని అన్వేషించే’ ఏఐ మోడళ్లను రూపొందించడంపై మస్క్ దృష్టి పెట్టాడని పలు కథనాల ద్వారా తెలుస్తోంది.
(ఇదీ చదవండి: క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!)
Comments
Please login to add a commentAdd a comment