ఎలక్ట్రిక్ వాహన రంగంలో కంపెనీల మధ్య తీవ్రపోటీ నెలకొంది. పెట్రోల్ ధరలు పెరగడం, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీ వాహనాలపై సబ్సిడీలు ఇవ్వడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో వారానికి ఒక కొత్త కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్‌లోకి తీసుకొని వస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనలను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఎవ్ ట్రిక్ మోటార్స్(EVTRIC Motors) హై-స్పీడ్ కేటగిరీలో మూడు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను[ఎవ్ ట్రిక్ రైజ్(మోటార్ సైకిల్), మైటీ (స్కూటర్) ఎవ్ట్రిక్ రైడ్ ప్రో (స్కూటర్)] విడుదల చేసింది.
గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో సెంటర్‌లో జరుగుతున్న ఈవీ ఇండియా ఎక్స్ పో 2021లో ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించారు. ఎవ్ ట్రిక్ రైజ్ ఎలక్ట్రిక్ బైక్ 3.0 కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ డిటాచబుల్ బ్యాటరీ చేత పనిచేస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ తో పాటు మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా లాంచ్ చేసింది. రైడ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఫుల్ ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. దీని టాప్ స్పీడ్-75కిమీ. అలాగే, మైటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఫుల్ ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. దీని టాప్ స్పీడ్-70కిమీ. ఈ స్వదేశీ ఈవీ తయారీ సంస్థకు 70కి పైగా డిస్ట్రిబ్యూటర్స్ నెట్ వర్క్ ఉన్నట్లు ప్రకటించింది. అంతేగాక, 2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు 150 పంపిణీదారుల మార్కుకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment