కృత్తిమ ఆధారిత (ai) టెక్నాలజీ వినియోగం ఊహించని విధంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా చాట్‌జీపీటీ టూల్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఏఐ చాప కిందనీరులా ప్రపంచాన్ని చుట్టేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఎదురయ్యే ప్రమాదాల్ని ముందుగానే పసిగడుతున్న టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జెఫ్రీ హింటన్ వంటి ప్రముఖులు ఏఐ వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నారు.
కానీ ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ వంటి టూల్స్‌ను వినియోగించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా కంపెనీల సీఈవోలు పోటీపడుతున్నారు.
తాజాగా, అమెరికాకు చెందిన అవతార్ టెక్నాలజీ కంపెనీ జెనీస్ సీఈవో ఆకాష్ నిఘమ్ చాట్‌జీపీటీని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో మొత్తం 120 మంది ఉద్యోగులున్నారు. వారి కోసం ఆకాష్ నిఘమ్ చాట్‌జీపీటీ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు పెడుతున్నారు. మార్చి నుంచి ఓపెన్ ఏఐ చాట్ బాట్ వినియోగంతో సంస్థలోని ఇంజినీరింగ్, ప్రొడక్ట్, ఫైనాన్స్, డిజైన్, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, అకౌంటింగ్‌తో పాటు ఇతర విభాగాల్లో ప్రొడక్టివిటీ పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలకు పరిష్కారం
అంతేకాదు ఏఐ ఉపయోగించడం వల్ల అన్నీ డిపార్ట్‌మెంట్‌లలో మెరుగైన ఫలితాలు రాబడుతున్నట్లు తెలిపారు. ఉదాహరణకు తమకు కావాల్సిన ప్రజెంటేషన్ స్క్రిప్ట్‌ను ఏఐ చాట్‌బాట్ తయారు చేస్తుంది.మ్యాథ్స్, కోడింగ్‌లోని సమస్యల్ని పరిష్కరిస్తుంది. సిబ్బందికి ప్రాజెక్ట్‌లలో ఐడియాలతో పాటు, కార్పొరేట్ రెగ్యులేషన్స్, రీసెర్చ్ టెక్నలాజికల్ వంటి సమస్యలకు సులభం పరిష్కారం దొరుకుతుందన్నారు.
చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సైతం
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్‌లు సైతం ఏఐ ఉపయోగం వల్ల కలిగే లాభాల్ని వివరిస్తున్నాయి. ఆఫీస్ వర్క్‌లో చాట్‌జీపీటీని వాడుకోవడం వల్ల 14 శాతం వర్క్ ప్రొడక్టవిటీ పెరిగిపోతుందని పేర్కొన్నాయి. ఇందులో సైంటిస్ట్‌లు, ఇంజినీర్లు, మేనేజర్ల వంటి స్కిల్డ్ వర్కర్లు 35శాతం కంటే ఫాస్ట్‌గా వారి వర్క్‌ను కంప్లీట్ చేస్తున్నట్లు నివేదికల్ని విడుదల చేశాయి.
ఐబీఎం వినియోగం.. ఉద్యోగాలకు ఎసరు?
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కారణంగా ప్రముఖ టెక్ దిగ్గజం వేలాది మంది ఉద్యోగుల అవసరాన్ని తీర్చుకోనుంది. ఏఐతో సంబంధం ఉన్న అన్నీ విభాగాల్లో కావాల్సిన నిపుణుల‍్ని తీసుకోవడం లేదని, వారి స్థానంలో కృత్తిమ మేధస్సును ఉపయోగిస్తున్నామని ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ప్రకటించడం కలకలం రేపుతోంది.
చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే?
Comments
Please login to add a commentAdd a comment