దేశంలో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు నేడు (జూలై 28) శాంతించాయి. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు క్రితం రోజున ఉన్నంటుండి పెరిగాయి. ఆ పెరుగుదల కొనసాగకుండా ఈరోజు నిలకడగా ఉండటంతో పసిడి ప్రియులకు ఊరట కలిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.63,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 69,000 వద్ద కొనసాగుతున్నాయి. ముంబై, బెంగళూరులోనూ ఇవే ధరలు ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.63,400 లుగా, 24 క్యారెట్ల బంగారం రూ.69,150 లుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.64,650 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.70,530 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.
వెండి ధర ఇలా..
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్ద ఉంది. ఇక్కడ వెండి ధరల్లో మార్పు లేకుండా కొనసాగడం వరుసగా ఇది మూడో రోజు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment