
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ రెండు రోజుల నుంచి పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగడంతో దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. నేడు న్యూఢిల్లీ బులియన్ ఇండియన్ జ్యూవెలరీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.47,989గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధర రూ.260కు పైగా పెరిగింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల బంగారం ధర రూ.43,571గా ఉంది.
ఇక హైదరాబాద్ గోల్డ్ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.120 పెరిగి రూ.48,880కు చేరుకుంటే.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.44,800గా ఉంది. విజయవాడ, విశాఖ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.330కి పైగా పెరిగి రూ.60,983కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.
#Gold and #Silver Opening #Rates for 12/01/2022#IBJA pic.twitter.com/iubz4i9MsT
— IBJA (@IBJA1919) January 12, 2022
(చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్‌లో రేట్లు ఇలా..!)
Comments
Please login to add a commentAdd a comment