అంతర్జాతీయంగా రికార్డు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పరుగులు పెడుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయర్క్ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఆగస్టు కాంట్రాక్ట్ ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో ఔన్స్‌కు (31.1గ్రా) ఆల్‌టైమ్ హై 2,469 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత అంచనా, ఈటీఎఫ్‌ల డిమాండ్, డాలర్ స్థిరత్వం వంటి అంశలు దీనికి కారణం.
ఢిల్లీలో ఐదురోజుల్లో రూ.1,300 అప్
ఇక అంతర్జాతీయ ట్రెండ్‌కు తోడు ఆభరణ వర్తకుల డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా ఐదవ రోజూ పెరిగింది. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర మంగళవారం రూ.550 పెరిగి రూ.75,700కు చేరింది. గడచిన ఐదు సెషన్లలో రేటు రూ.1,300 పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment