ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం, కరోనా మూడో ఉధృతి ఖాయమన్న పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్ కంపెనీలు..అత్యవసర విధానాలను అమలు చేయడంపై దృష్టి మళ్లించాయి. దీంతో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికాలోని గూగుల్ సంస్థలో విధుల నిర్వహించే ఉద్యోగులకు ఆ సంస్థ పలు ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ ఉద్యోగులు తాత్కాలికంగా వారం వారం తప్పని సరిగ్గా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. టెస్ట్ చేయించుకున్న ఉద్యోగులు ఆ రిపోర్ట్‌ను ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలని, పనిలోపనిగా ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలనుకుంటే సర్జికల్ గ్రేడ్ మాస్క్‌లు తప్పని సరిగా ధరించాలని ఆదేశించింది. లేదంటే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
గూగుల్‌లో ఇలా కోవిడ్ నిబంధనలు పాటించడం వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని, అందుకే ఉద్యోగులు తప్పని సరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని సూచించామని' గూగుల్ స్పోక్ పర్సన్ తెలిపారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేసే ఉద్యోగులు కోవిడ్ టెస్ట్ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవని చెప్పారు.
తాత్కాలికంగానే..
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తో పాటు ఒమిక్రాన్ కేసులు నమోదు కారణంగా తాత్కాలికంగా ఉద్యోగులు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అందించాలని చెప్పినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓమిక్రాన్‌పై పెరుగుతున్న ఆందోళనల మధ్య జనవరి నుండి ప్రపంచవ్యాప్తంగా రిటర్న్-టు-ఆఫీస్ ప్లాన్‌ను ఆలస్యం చేస్తున్నట్లు గూగుల్ గత నెలలో తెలిపింది. సీఎన్‌బీసీ రిపోర్ట్ ప్రకారం..మహమ్మారి సమయంలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని కోరింది. కోవిడ్ టీకా నిబంధనల్ని పాటించని ఉద్యోగులకు జీతంలో కోత విధిస్తామంటూ పలు నిబంధనల్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఒమిక్రాన్ బీభత్సం
ప్రమాదం తీవ్రత తక్కువగా ఉన్న వేగంగా వ్యాపించే గుణం ఎక్కువగా ఉండడంతో ఒమిక్రాన్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికి పోతుంది. రోజూ వారికి నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య 11లక్షలకు మించిపోతున్నాయి. అదే సమయంలో రోజుకు లక్షన్నర మందికి పైగా ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కరోనా టెస్ట్ తప్పని సరి విధిస్తూ కొత్త నిబంధల్ని అమలు చేస్తుంది.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ 2022.. నచ్చిన చోట నుంచి పనిచేసే వెసులుబాటు!
Comments
Please login to add a commentAdd a comment