గూగుల్ తన సిబ్బందిని తిరిగి ఆఫీస్ రప్పించడం కోసం ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో 1 బిలియన్ డాలర్లు విలువ గల భవనాన్ని కొనుగోలు చేసింది. టెక్ దిగ్గజం ఒక ప్రకటనలో సెంట్రల్ లండన్ కేంద్రంగా సెంట్రల్ సెయింట్ గైల్స్ భవనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే భవనంలో గూగుల్ ఇప్పటివరకు లీజుకు ఉంది. ఈ కార్యాలయ భవనాన్ని కొనుగోలు చేయడం ద్వారా అక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్యను 6,400 నుంచి 10,000కు పెంచుకోవాలని చూస్తున్నట్లు గూగుల్ యూకే, ఐర్లాండ్ వైస్ ప్రెసిడెంట్ రోనన్ హారిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
గూగుల్ యుకె సిబ్బందిలో ఎక్కువ మంది కార్యాలయంలో పని చేయడానికి, వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి పని చేయడానికి ఇష్టపడుతున్నారని హారిస్ చెప్పారు. ఇతర ఉద్యోగులు పూర్తిగా రిమోట్ గా పనిచేయాలని అనుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యాలయంలో నిశ్శబ్ద జోన్లు, లాంజ్ ప్రాంతాలు, సహోద్యోగుల మధ్య సహకారం కోసం టీమ్ పాడ్లు, అవుట్ డోర్ కవర్డ్ వర్కింగ్ స్పేస్లు ఉంటాయి. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికప్రకారం ఉద్యోగులకు "క్యాంప్ ఫైర్" స్థలాలు కూడా ఉంటాయి. ఈ భవనం లోపల వీడియో కాల్స్ కోసం వృత్తాకార సమావేశ గదులు కూడా ఉన్నాయి. ఈ సిలికాన్ వ్యాలీ సంస్థ గత సంవత్సరంలో దాదాపు 700 మందిని నియమించుకున్నట్లు హారిస్ తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ప్రపంచ అంతటా మళ్లీ ఉద్యోగుల ఇంటి నుంచి పనిచేసేందుకు ప్రైవేట్ కంపెనీలు అనుమతి తెలుపుతున్నాయి.
(చదవండి: స్విట్జర్లాండ్‌కు గుడ్ బై చెప్పిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment