సామాన్యులు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (ఎఫ్‌డీలు) ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవడం సాధారణ విషయమే. కానీ, అధిక సంపద కలిగిన వారు (హెచ్‌ఎన్‌ఐలు) కూడా మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎఫ్‌డీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయాన్ని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో బ్యాంక్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 2 శాతం వరకు పెరగడాన్ని సానుకూల అంశంగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రస్తావించింది.
ఈ పరిణామాలతో హెచ్‌ఎన్‌ఐలు మ్యూచువల్ ఫండ్స్ కంటే బ్యాంక్ ఎఫ్‌డీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు వివరించింది. ఇతర ఆర్థిక సాధనాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే సానుకూలతలను హెచ్‌ఎన్‌ఐలు అర్థం చేసుకున్నప్పటికీ, ఈ రంగంలో గతంలోని ఎదుర్కొన్న సమస్యలు వారిని ఇంకా ఆందోళనకు గురి చేస్తున్నట్టు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల తరఫున పెద్ద పంపిణీదారులు (రూ.1,000 కోట్లకు పైన ఏయూఎం ఉన్నవారు), ఇనిస్టిట్యూషనల్ సేల్స్ ప్రతినిధులు తదితరుల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఈ నివేదికను మోతీలాల్ ఓస్వాల్ రూపొందించింది.
హెచ్‌ఎన్‌ఐలు పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్కీమ్‌లు (పీఎంఎస్), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు)ల్లో పెట్టుబడులకు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) మార్గంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం లేదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పన్ను ప్రయోజనాలు ఎత్తివేయడంతో, వీటితో పోలిస్తే బ్యాంక్ ఎఫ్‌డీలకే హెచ్‌ఎన్‌ఐలు సానుకూలంగా ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. డెట్ ఫండ్స్‌లో మూడేళ్లకు మించి పెట్టుబడులు ఉంచినప్పుడు వచ్చే రాబడిలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని సర్దుబాటు చేసే ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని 2023 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం ఎత్తివేయడం గమనార్హం. దీంతో డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎంత కాలం ఉంచినా, వచ్చే రాబడి సంబంధిత ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment