HNIs
-
హైదరాబాద్ రియల్ఎస్టేట్పై గురి.. పెట్టుబడులకు హెచ్ఎన్ఐల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ రంగంలో హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరు ప్రధానంగా వాణిజ్య సముదాయాలలో ఇన్వెస్ట్మెంట్లకు మొగ్గు చూపుతున్నారని నోబ్రోకర్.కామ్ సీఈఓ అమిత్ అగర్వాల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కమర్షియల్ ప్రాపర్టీలలో హెచ్ఎన్ఐ ఇన్వెస్ట్మెంట్లు 80 శాతం మేర వృద్ధి చెందాయని పేర్కొన్నారు. హెచ్ఎన్ఐలు ప్రధానంగా చిన్న ఆఫీసులు, క్లినిక్‌లు, షోరూమ్‌లు, రెస్టారెంట్లు వంటి బహుళ ప్రయోజనాలు గల వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారని ఆయన వివరించారు. నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈస్ట్ హైదరాబాద్‌లో మెరుగైన కనెక్టివిటీ, జీవన వ్యయం తక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు ఈ ప్రాంతంపై ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఇదీ చదవండి: చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు! -
ప్యాసివ్ ఫండ్స్‌కే హెచ్ఎన్ఐల మొగ్గు
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు (హెచ్ఎన్ఐలు) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022-23) ప్యాసివ్ ఫండ్స్ పట్ల ఎక్కువగా మొగ్గు చూపించారు. దీనికి కారణం లేకపోలేదు. హెచ్ఎన్ఐల ఈటీఎఫ్ పెట్టుబడులు (ప్యాసివ్‌లు) గతేడాది మంచి పనితీరు చూపించాయి. వారి ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.34,000 కోట్లకు చేరుకుంది. ఇది 2022 మార్చి నాటికి ఉన్న రూ.20,400 కోట్లతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 67 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) 2021 మార్చి నాటికి వీటి విలువ రూ.13,700 కోట్లుగా, 2020 మార్చి నాటికి రూ.7,500 కోట్లుగా ఉండడం గమనార్హం. హెచ్ఎన్ఐల ఈటీఎఫ్ పెట్టుబడులు 2018-19 నుంచి 2022–23 మధ్య ఏటా 70 శాతం కాంపౌండెడ్ వృద్ధిని చూశాయి. ఈటీఎఫ్, ఇండెక్స్ పండ్స్‌ను ప్యాసివ్ ఫండ్స్‌గా చెబుతారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల్లో ప్యాసివ్ పెట్టుబడుల విలువ 2019 నాటికి ఉన్న 6 శాతం నుంచి 2023 మార్చి నాటికి 16.5 శాతానికి పెరిగింది. ఫండ్స్ ఈటీఎఫ్ ఆస్తులు పెరగడానికి ప్రధానంగా ఈపీఎఫ్‌వో చేస్తున్న పెట్టుబడులేనని చెప్పుకోవాలి. ఇక హెచ్ఎన్ఐల ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ పెట్టుబడులనూ (ఏయూఎం) కలిపి చూస్తే గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఏటా 145 శాతం వృద్ధిని చూశాయి. రిటైల్ ఇన్వెస్టర్ల ఈటీఎఫ్ ఆస్తులు కూడా ఇదే కాలంలో ఏటా 56 శాతం చొప్పున పెరుగుతూ 2023 మార్చి నాటికి రూ.9,700 కోట్లకు చేరాయి. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఫిక్స్డ్ డిపాజిట్లకే బడా ఇన్వెస్టర్ల మొగ్గు
సామాన్యులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో (ఎఫ్డీలు) ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవడం సాధారణ విషయమే. కానీ, అధిక సంపద కలిగిన వారు (హెచ్ఎన్ఐలు) కూడా మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎఫ్డీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయాన్ని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 2 శాతం వరకు పెరగడాన్ని సానుకూల అంశంగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రస్తావించింది. ఈ పరిణామాలతో హెచ్ఎన్ఐలు మ్యూచువల్ ఫండ్స్ కంటే బ్యాంక్ ఎఫ్డీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు వివరించింది. ఇతర ఆర్థిక సాధనాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే సానుకూలతలను హెచ్ఎన్ఐలు అర్థం చేసుకున్నప్పటికీ, ఈ రంగంలో గతంలోని ఎదుర్కొన్న సమస్యలు వారిని ఇంకా ఆందోళనకు గురి చేస్తున్నట్టు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల తరఫున పెద్ద పంపిణీదారులు (రూ.1,000 కోట్లకు పైన ఏయూఎం ఉన్నవారు), ఇనిస్టిట్యూషనల్ సేల్స్ ప్రతినిధులు తదితరుల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఈ నివేదికను మోతీలాల్ ఓస్వాల్ రూపొందించింది. హెచ్ఎన్ఐలు పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్‌లు (పీఎంఎస్), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు)ల్లో పెట్టుబడులకు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) మార్గంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం లేదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పన్ను ప్రయోజనాలు ఎత్తివేయడంతో, వీటితో పోలిస్తే బ్యాంక్ ఎఫ్డీలకే హెచ్ఎన్ఐలు సానుకూలంగా ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. డెట్ ఫండ్స్‌లో మూడేళ్లకు మించి పెట్టుబడులు ఉంచినప్పుడు వచ్చే రాబడిలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని సర్దుబాటు చేసే ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని 2023 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం ఎత్తివేయడం గమనార్హం. దీంతో డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎంత కాలం ఉంచినా, వచ్చే రాబడి సంబంధిత ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. -
వారికోసం యస్ బ్యాంక్ ప్రైవేట్ డెబిట్ కార్డు, బెనిఫిట్స్ ఏంటి?
ముంబై: అత్యంత సంపన్న కస్టమర్ల (హెచ్ఎన్ఐ) కోసం మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యంతో యస్ బ్యాంక్ కొత్తగా ప్రైవేట్ డెబిట్ కార్డును ఆవిష్కరించింది. సంపన్న ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్ల అవసరాలకు తగినట్లుగా ఇందులో ఫీచర్లు ఉంటాయని యస్ బ్యాంక్ గ్లోబల్ హెడ్ రాజన్ పెంటాల్ తెలిపారు. ట్రావెల్, వెల్నెస్, లైఫ్‌స్టయిల్ వంటి వివిధ విభాగాల్లో ప్రత్యేక ప్రయోజనాలు అందు కోవచ్చని పేర్కొన్నారు. ఓబెరాయ్ హోట ల్స్ నుంచి ఈ-గిఫ్ట్ వోచర్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, ఎయిర్పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ పొందవచ్చని వివరించారు. ఆసి యా పసిఫిక్ దేశాల్లో ఈ తరహా వర ల్డ్ ఎలైట్ డెబిట్ కార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ తెలిపారు. -
లగ్జరీ విల్లాలకు ఊపు: ఎన్ఆర్ఐ, బడాబాబులే తోపు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి తర్వాత విల్లాలకు ఊపొచ్చింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా మహమ్మారి లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతుంది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం మూలంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ♦ ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1.84 లక్షల గృహాలు విక్రయం కాగా.. ఇందులో 14 శాతం అంటే 25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే అమ్ముడుపోయాయని అనరాక్ గ్రూప్ సర్వే వెల్లడించింది. అదే కరోనా కంటే ముందు 2019 ఏడాది మొత్తం చూస్తే.. 2.61 లక్షల యూనిట్లు విక్రయం కాగా.. కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలున్నాయని పేర్కొంది. లాంచింగ్‌లోనూ లగ్జరే.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్ లాంచింగ్‌లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019లో 28,960 విలాసవంతమైన ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరం నాటికే ఏకంగా 28 వేల లగ్జరీ గృహాలను లాంచింగ్ చేశారు. పశ్చిమంలో హవా.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో పశ్చిమాది ప్రాంతాలదే హవా కొనసాగుతోంది. గత మూడు త్రైమాసికాల నుంఇచ కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి. వెస్ట్ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వృద్ధి కారణాలివే.. 2019 నుంచి 2022 హెచ్1తో పోలిస్తే రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల విక్రయాలలో రెండింతల వృద్ధి నమోదయింది. 2022 హెచ్1లో అత్యధిక లగ్జరీ గృహాలు అమ్ముడుపోయింది ముంబైలోనే. ఇక్కడ 13,670 యూనిట్లు సేలయ్యాయి. ఆ తర్వాతి ఎన్సీఆర్లో 4,160 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2019లో ఈ రెండు నగరాలలో 11,890 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలోనే 17,830 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019 నుంచి 2022 హెచ్ 1తో పోలిస్తే ముంబైలో లగ్జరీ గృహాల అమ్మకాలు 13 శాతం 25 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఎన్సీఆర్లో 4 శాతం నుంచి 12 శాతానికి వృద్ధి చెందాయి. -
భారత్‌లో పెరగనున్న బిలియనీర్లు..
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన వ్యక్తుల (హెచ్ఎన్ఐ) సంఖ్య 2018తో పోలిస్తే 2019లో 6.4 శాతం పెరిగి 5,13,200 మందికి పెరిగిందని నైట్‌ఫ్రాంక్ సంపద నివేదిక వెల్లడించింది. ఈ తరహా సంపన్నుల జాబితాలో 5,986 మంది అత్యంత సంపన్నులతో భారత్ 12వ స్ధానంలో నిలిచిందని తెలిపింది. 2024 నాటికి భారత్‌లో అత్యంత సంపన్నుల సంఖ్య 10,354కు పెరుగుతుందని అంచనా వేసింది. ఇక 2019లో భారత్‌లో 104గా ఉన్న బిలియనీర్ల సంఖ్య 2024 నాటికి 113కు చేరుతుందని పేర్కొంది. ఇక భారత్‌లో అత్యంత సంపన్నులు అధికంగా తమ రాబడిలో 72 శాతం ఈక్విటీ మార్కెట్లలో మదుపుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈక్విటీ మార్కెట్లలో అత్యంత సంపన్నులు మదుపు చేసే సగటు పెట్టుబడి 29 శాతం కంటే ఇది అధికం కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు చెందిన అత్యంత సంపన్నులకు సంబంధించి 3.3 లక్షల డాలర్ల వెల్త్‌ను పర్యవేక్షిస్తున్న ప్రైవేట్ బ్యాంకర్లు, వెల్త్ అడ్వైజర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే రూపొందింది. ప్రస్తుతం అత్యంత సంపన్నులు, బిలియనీర్ల జాబితాలో అమెరికా ముందుండగా 2024 నాటికి అమెరికా, యూరప్‌లకు దీటుగా ఆసియా సత్తా చాటనుందని నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది. చదవండి : ప్రపంచ కుబేరుల్లో ‘చిన్నది’ -
మన మిలియనీర్లు ఎందరంటే...
సాక్షి,న్యూఢిల్లీ: మిలియనీర్ల సంఖ్యలో ఆసియా పసిఫిక్‌లోనే భారత్ నాలుగో అతిపెద్ద దేశంగా నిలిచింది. భారత్‌లో 2,19,000 మంది మిలియనీర్లున్నారని వీరి ఉమ్మడి సంపద 87,700 కోట్ల డాలర్లని ఆసియా పసిఫిక్ వెల్త్ రిపోర్ట్ 2017 వెల్లడించింది. క్యాప్‌జెమిని రూపొందించిన ఈ నివేదికలో భారత్‌లో మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తేలింది. నివాసం, వినియోగ వస్తువులు, స్థిరాస్తులు మినహాయించి లక్ష డాలర్లు దాటిన ఆస్తులు కలిగిన మిలియనీర్లను ఈ నివేదికలో పొందుపరిచారు. 2016 సంవత్సరాంతానికి 28,91,000 మిలియనీర్లతో జపాన్ ముందువరసలో ఉండగా, 11,29,000 మిలియనీర్లతో చైనా ద్వితీయ ర్యాంక్‌లో నిలిచింది. 2,55,000 అధిక నికర ఆస్తులు కలిగిన వారితో ఆస్ర్టేలియా మూడవ స్ధానం సాధించింది. 2015-16లో భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 9.5 శాతం పెరగడం గమనార్హం. ఇది చైనా, జపాన్‌లో మిలియనీర్ల వృద్ధి రేటు కంటే అధికం.మిలియనీర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా సంపద, ఆదాయ అసమానతలు వేగంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. -
అపర కుబేరులు... మూడేళ్లలో మూడింతలు!
ముంబై: మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు రూ.25 కోట్లకుపైగా మిగులు నిధులున్న అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐలు) సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం వృద్ధిచెంది 1.17 లక్షలకు చేరింది. వచ్చే మూడేళ్లలో వీరి సంఖ్య మూడింతలు పెరిగి 3.43 లక్షలయ్యే అవకాశం ఉందని కోటక్ గ్రూప్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఓ నివేదికలో పేర్కొన్నాయి. అపర కుబేరులైన వీరి ఆస్తుల విలువ గతేడాది 21 శాతం పెరిగి రూ.104 లక్షల కోట్లకు చేరింది. ఏటా రూ.3 కోట్లకు మించిన ఆదాయం కలిగిన వృత్తినిపుణులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరో మూడు సంవత్సరాల్లో వీరి ఆస్తుల విలువ దాదాపు నాలుగింతలై రూ.408 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. యూహెచ్ఎన్ఐల సంఖ్య పెరుగుదల కంటే ఆస్తుల విలువ వృద్ధిరేటు అధికంగా ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ భాగస్వామి మురళీ బలరాం బుధవారం ముంబైలో మీడియాకు తెలిపారు. కోటక్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీతో కలసి నివేదిక రూపొందించామని చెప్పారు. సంపదను ఎలా సృష్టించారన్న అంశంపై నివేదికలో దృష్టిపెట్టలేదని అన్నారు. సుమారు 150 మంది యూహెచ్‌ఎన్‌ఐలు, లగ్జరీ బ్రాండ్లను విక్రయించే 15-20 కంపెనీలతో పాటు వెల్త్మేనేజర్లను గత మార్చిలో ఇంటర్వ్యూ చేసి రిపోర్టు తయారుచేశామని వివరించారు. ఇటీవలి ఎన్నికలకు ముందే నిర్వహించిన ఇంటర్వ్యూల్లో దేశీయ ఆర్థిక భవితపై ఎంతో ఆశావాదం వ్యక్తమైందని తెలిపారు.