సాక్షి,న్యూఢిల్లీ: మిలియనీర్ల సంఖ్యలో ఆసియా పసిఫిక్‌లోనే భారత్ నాలుగో అతిపెద్ద దేశంగా నిలిచింది. భారత్‌లో 2,19,000 మంది మిలియనీర్లున్నారని వీరి ఉమ్మడి సంపద 87,700 కోట్ల డాలర్లని ఆసియా పసిఫిక్ వెల్త్ రిపోర్ట్ 2017 వెల్లడించింది. క్యాప్‌జెమిని రూపొందించిన ఈ నివేదికలో భారత్‌లో మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తేలింది. నివాసం, వినియోగ వస్తువులు, స్థిరాస్తులు మినహాయించి లక్ష డాలర్లు దాటిన ఆస్తులు కలిగిన మిలియనీర్లను ఈ నివేదికలో పొందుపరిచారు.
2016 సంవత్సరాంతానికి 28,91,000 మిలియనీర్లతో జపాన్ ముందువరసలో ఉండగా, 11,29,000 మిలియనీర్లతో చైనా ద్వితీయ ర్యాంక్‌లో నిలిచింది. 2,55,000 అధిక నికర ఆస్తులు కలిగిన వారితో ఆస్ర్టేలియా మూడవ స్ధానం సాధించింది. 2015-16లో భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 9.5 శాతం పెరగడం గమనార్హం.
ఇది చైనా, జపాన్‌లో మిలియనీర్ల వృద్ధి రేటు కంటే అధికం.మిలియనీర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా సంపద, ఆదాయ అసమానతలు వేగంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment