న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు (హెచ్‌ఎన్‌ఐలు) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022-23) ప్యాసివ్ ఫండ్స్ పట్ల ఎక్కువగా మొగ్గు చూపించారు. దీనికి కారణం లేకపోలేదు. హెచ్‌ఎన్‌ఐల ఈటీఎఫ్ పెట్టుబడులు (ప్యాసివ్‌లు) గతేడాది మంచి పనితీరు చూపించాయి. వారి ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.34,000 కోట్లకు చేరుకుంది. ఇది 2022 మార్చి నాటికి ఉన్న రూ.20,400 కోట్లతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 67 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు)
2021 మార్చి నాటికి వీటి విలువ రూ.13,700 కోట్లుగా, 2020 మార్చి నాటికి రూ.7,500 కోట్లుగా ఉండడం గమనార్హం. హెచ్‌ఎన్‌ఐల ఈటీఎఫ్ పెట్టుబడులు 2018-19 నుంచి 2022–23 మధ్య ఏటా 70 శాతం కాంపౌండెడ్ వృద్ధిని చూశాయి. ఈటీఎఫ్, ఇండెక్స్ పండ్స్‌ను ప్యాసివ్ ఫండ్స్‌గా చెబుతారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల్లో ప్యాసివ్ పెట్టుబడుల విలువ 2019 నాటికి ఉన్న 6 శాతం నుంచి 2023 మార్చి నాటికి 16.5 శాతానికి పెరిగింది.
ఫండ్స్ ఈటీఎఫ్ ఆస్తులు పెరగడానికి ప్రధానంగా ఈపీఎఫ్‌వో చేస్తున్న పెట్టుబడులేనని చెప్పుకోవాలి. ఇక హెచ్‌ఎన్‌ఐల ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ పెట్టుబడులనూ (ఏయూఎం) కలిపి చూస్తే గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఏటా 145 శాతం వృద్ధిని చూశాయి. రిటైల్ ఇన్వెస్టర్ల ఈటీఎఫ్ ఆస్తులు కూడా ఇదే కాలంలో ఏటా 56 శాతం చొప్పున పెరుగుతూ 2023 మార్చి నాటికి రూ.9,700 కోట్లకు చేరాయి. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్)
మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment