సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ రంగంలో హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ)లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరు ప్రధానంగా వాణిజ్య సముదాయాలలో ఇన్వెస్ట్‌మెంట్లకు మొగ్గు చూపుతున్నారని నోబ్రోకర్.కామ్ సీఈఓ అమిత్ అగర్వాల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కమర్షియల్ ప్రాపర్టీలలో హెచ్‌ఎన్‌ఐ ఇన్వెస్ట్‌మెంట్లు 80 శాతం మేర వృద్ధి చెందాయని పేర్కొన్నారు.
హెచ్‌ఎన్‌ఐలు ప్రధానంగా చిన్న ఆఫీసులు, క్లినిక్‌లు, షోరూమ్‌లు, రెస్టారెంట్లు వంటి బహుళ ప్రయోజనాలు గల వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారని ఆయన వివరించారు. నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈస్ట్ హైదరాబాద్‌లో మెరుగైన కనెక్టివిటీ, జీవన వ్యయం తక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు ఈ ప్రాంతంపై ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!
Comments
Please login to add a commentAdd a comment