interested in
-
ఫండ్స్‌లో పెట్టుబడులకు క్యూ
న్యూఢిల్లీ: గత క్యాలండర్ ఏడాది(2024)లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పట్ల ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిని ప్రదర్శించారు. దీంతో 239 కొత్త ఫండ్ ఆఫరింగ్స్(ఎన్‌ఎఫ్‌వోలు) ద్వారా మొత్తం రూ. 1.18 లక్షల కోట్లను అందుకున్నాయి. వీటిలో సెక్టోరల్ లేదా థిమాటిక్ ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్టర్లను గరిష్టంగా ఆకట్టుకున్నట్లు జెర్మినేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. కాగా.. 2023లో 212 ఎన్‌ఎఫ్‌వోలు ఉమ్మడిగా రూ. 63,854 కోట్లు సమీకరించగా.. 2022లో 228 పథకాలకు రూ. 62,187 కోట్లు లభించాయి. అంతక్రితం అంటే 2020లో 81 కొత్త పథకాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. తద్వారా ఫండ్స్ రూ. 53,703 కోట్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే గతేడాది రెట్టింపు పెట్టుబడులు అందుకోవడం గమనార్హం! ఇది ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసంతోపాటు.. పటిష్ట వృద్ధి పథాన్ని ప్రతిబింబిస్తోంది. మార్కెట్ల ఎఫెక్ట్ సాధారణంగా స్టాక్ మార్కెట్లు పురోగమిస్తున్నప్పుడు ఎన్‌ఎఫ్‌వోలు వెలువడుతుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సానుకూల సెంటిమెంటు, ఇన్వెస్టర్ల ఆశావహ ధృక్పథం ప్రభావం చూపుతుంటాయి. ఇన్వెస్టర్ల ఆసక్తి ఆధారంగా కొత్త పథకాలకు ఫండ్స్ తెరతీస్తుంటాయి. దీంతో పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతాయి. వెరసి 2024లో అధిక ఎన్‌ఎఫ్‌వోల ద్వారా భారీగా పెట్టుబడులను సమీకరించాయి. గతేడాది స్టాక్ ఇండెక్స్‌లలో సెన్సెక్స్ 5,899 పాయింట్లు(8.2 శాతం) జంప్‌చేయగా.. నిఫ్టీ 1,913 పాయింట్లు(8.8 శాతం) ఎగసింది. ఈఎస్జీ సైతం గతేడాది పెట్టుబడుల్లో థిమాటిక్, సెక్టోరల్, ఇండెక్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు) అధిక శాతం ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. నివేదిక ప్రకారం 53 ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఫండ్స్‌కు రూ. 79,109 కోట్లు లభించాయి. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా రూపొందించిన థీమ్స్ లేదా థిమాటిక్, సెక్టోరల్ ఫండ్స్ ఇందుకు సహకరించాయి. తయారీ, టెక్నాలజీ, పర్యావరణం, సామాజిక, సుపరిపాలన(ఈఎస్జీ) విభాగాలను ఇందుకు ప్రస్తావించవచ్చు. విడిగా చూస్తే హెచ్డీఎఫ్సీ మ్యాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఎన్ఎఫ్వో గత ఏప్రిల్‌లో రూ. 12,500 కోట్లు అందుకుంది. డిసెంబర్లో అత్యధిక ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లను తాకడం ప్రస్తావించదగ్గ అంశం! -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్‌పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్‌లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్‌కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్‌కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్‌లాండ్‌లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్‌కోర్‌వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్‌లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్‌పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్‌గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
హైదరాబాద్ రియల్ఎస్టేట్పై గురి.. పెట్టుబడులకు హెచ్ఎన్ఐల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ రంగంలో హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరు ప్రధానంగా వాణిజ్య సముదాయాలలో ఇన్వెస్ట్మెంట్లకు మొగ్గు చూపుతున్నారని నోబ్రోకర్.కామ్ సీఈఓ అమిత్ అగర్వాల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కమర్షియల్ ప్రాపర్టీలలో హెచ్ఎన్ఐ ఇన్వెస్ట్మెంట్లు 80 శాతం మేర వృద్ధి చెందాయని పేర్కొన్నారు. హెచ్ఎన్ఐలు ప్రధానంగా చిన్న ఆఫీసులు, క్లినిక్‌లు, షోరూమ్‌లు, రెస్టారెంట్లు వంటి బహుళ ప్రయోజనాలు గల వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారని ఆయన వివరించారు. నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈస్ట్ హైదరాబాద్‌లో మెరుగైన కనెక్టివిటీ, జీవన వ్యయం తక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు ఈ ప్రాంతంపై ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఇదీ చదవండి: చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు! -
రోజూ 60 వేల మంది వీక్షణ
సాక్షి, హైదరాబాద్: ‘టి సాట్’ఇంజనీరింగ్ పాఠ్యాంశ ప్రసారాలపై విద్యార్థులు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. జూలై 26న ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమాలు 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 8.15 నుంచి 10.30 వరకు ‘టి సాట్ యాప్, విద్య, నిపుణ చానళ్లు, టి సాట్ ఫేస్బుక్ పేజీ, యూ ట్యూబ్ చానళ్ల ద్వారా విద్యార్థులు వీక్షిస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటి వరకు రోజూ సుమారు 60 వేల మంది ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను వీక్షిస్తున్నట్లు ‘టి సాట్’లెక్కలు వేస్తోంది. ‘వెరీ లార్జ్‌స్కేల్ ఇంటిగ్రేషన్’(వీఎల్ఎస్ఐ) ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ అనే అంశంపై ఇప్పటి వరకు 12 పాఠ్యాంశాలను ‘టి సాట్’ప్రసారం చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు తరగతి గదులు, ఆఫ్‌లైన్‌లో విద్యాబోధన జరుగుతున్నా తమ కెరీర్ నిర్మాణంలో అత్యం త కీలకమైన నైపుణ్యాలను విద్యార్థి దశలో సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ (టాస్క్) ఇతర సంస్థల భాగస్వామ్యంతో పాఠ్యాం శాలను రూపొందిస్తోంది. ఫొటోనిక్స్ వాలీ కార్పొరేషన్, వేద ఐఐటీ పాఠ్యాంశాల రూపకల్పనలో పా లుపంచుకుంటున్నాయి. పరిశ్రమల అవసరాలు, నైపుణ్యాల పెంపు, ఉద్యోగ అవకాశాలు, సంస్థాగత సాంకేతికత, ఇతర అంశాలపై ‘వీఎల్ఎస్ఐ’ప్రత్యేక్ష శిక్షణ కార్యక్రమాలు రూపొందుతున్నాయి. -
ఆసక్తి ఉంటే విజయం తథ్యం
ఆర్జేడీ కాశీనాథ్ రంగశాయిపేటలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు 400 మంది కీడాకారులు హాజరు.. కరీమాబాద్ : క్రీడలలో ఆసక్తి.. గెలవాలనే తపన ఉంటే విజయం తథ్యమని ఇంటర్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీఐఈ) కాశీనాథ్ అన్నారు. నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో మంగళవారం ఎస్జీఎఫ్ఐ అండర్ –19 రాష్ట్ర స్థాయి టెన్నిస్, వాలీ బాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీ లు ప్రారంభమయ్యాయి. ముఖ్య అథిది గా హాజరైన కాశీనాథ్ మాట్లాడుతూ క్రీడాకారులు ఓర్పు నేర్పుతో ముందుకు సాగాలన్నారు. క్రీడాభివృద్ధి కోసం జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో 44 పీడీ పోస్టుల భర్తీకి కృషి చేస్తానని చెప్పారు. క్రీడా నిధిని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబూరావు, జేఎల్ఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో పీడీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అండర్–19 జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కోట సతీష్ మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పించినట్లు చెప్పారు. అంతకు ముందు పాకిస్తాన్ ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన భారత సైనికుల ఆత్మశాంతికి మౌనం పాటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కేడల పద్మ, డాక్టర్ బాలరాజు, బరుపాటి గోపి, నర్సింహం, రామయ్య, శ్రీనివాగౌడ్, నర్సయ్య, కత్తి కుమారస్వామి పాల్గొన్నారు.