- ఆర్‌జేడీ కాశీనాథ్
- రంగశాయిపేటలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు
- 400 మంది కీడాకారులు హాజరు..
ఆసక్తి ఉంటే విజయం తథ్యం
Published Wed, Sep 21 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
కరీమాబాద్ : క్రీడలలో ఆసక్తి.. గెలవాలనే తపన ఉంటే విజయం తథ్యమని ఇంటర్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్‌జేడీఐఈ) కాశీనాథ్ అన్నారు. నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో మంగళవారం ఎస్‌జీఎఫ్‌ఐ అండర్ –19 రాష్ట్ర స్థాయి టెన్నిస్, వాలీ బాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీ లు ప్రారంభమయ్యాయి.
ముఖ్య అథిది గా హాజరైన కాశీనాథ్ మాట్లాడుతూ క్రీడాకారులు ఓర్పు నేర్పుతో ముందుకు సాగాలన్నారు. క్రీడాభివృద్ధి కోసం జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో 44 పీడీ పోస్టుల భర్తీకి కృషి చేస్తానని చెప్పారు. క్రీడా నిధిని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబూరావు, జేఎల్‌ఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో పీడీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అండర్–19 జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కోట సతీష్ మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పించినట్లు చెప్పారు. అంతకు ముందు పాకిస్తాన్ ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన భారత సైనికుల ఆత్మశాంతికి మౌనం పాటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కేడల పద్మ, డాక్టర్ బాలరాజు, బరుపాటి గోపి, నర్సింహం, రామయ్య, శ్రీనివాగౌడ్, నర్సయ్య, కత్తి కుమారస్వామి పాల్గొన్నారు.
Advertisement
Advertisement