
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా పలు బ్యాంకులు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ రూ .1100 ప్రాసెసింగ్ ఫీజుతో 6.70% వడ్డీతో హోం లోన్ ,వ్యక్తిగత రుణం 10.25% వడ్డీతో అందిస్తుంది.ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి తెలిపారు.
ప్రత్యేక ఆఫర్లు ఇవే..
ఆటో లోన్ : 8 సంవత్సరాలు ఆటోలోన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆటోపై రూ .1 లక్ష రుణం తీసుకుంటే నెలవారీ వాయిదాగా రూ .799 చెల్లించాల్సి ఉంటుంది.
ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్: రూ.1999 ప్రాసెసింగ్ ఫీజుతో వ్యక్తిగత రుణాన్ని 10.25% ఇంటస్ట్ర్‌తో అందిస్తుంది.
కన్జ్యూమర్ ఫైనాన్స్ లోన్: గృహోపకరణాలు, డిజిటల్ ప్రాడక్ట్‌లను నో కాస్ట్ ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఇందుకోసం సంబంధిత ప్రూప్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఎంటర్‌ప్రైజ్ లోన్ : ఓవర్ డ్రాఫ్ట్ కింద మీకు రూ .50 లక్షల వరకు అసురక్షిత ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందని రూ .15 లక్షల వరకు ఓడీ తీసుకోవచ్చు. మీరు ఉపయోగించే మొత్తానికి మీరు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మీరు రుణాన్ని ముందుగానే తిరిగి చెల్లిస్తే, దానిపై మీకు ఎలాంటి ఛార్జీ విధించరు.
ఓవర్ డ్రాఫ్ట్ అంటే : ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయపడేందుకు బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఉదాహరణకు మీ సేవింగ్ అకౌంట్‌లో, లేదంటే కరెంట్ అకౌంట్‌లో మనీ జీరో బ్యాలెన్స్‌లో ఉంటే సంబంధిత బ్యాంకులు ఈ ఓవర్ డ్రాఫ్ట సదుపాయాన్ని అందిస్తుంటాయి. ఈ సదుపాయంతో బ్యాంకులు పెద్దమొత్తంలో డబ్బుల్ని అందిస్తుంటాయి. అయితే చెల్లించాల్సిన టైమ్‌లోపులోనే చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఇంటస్ట్ర్ పడుతుంది.
ఆయా బ్రాండ్‌లపై స్పెషల్ డిస్కౌంట్స్
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మిత్రా, టాటా క్లిక్ ,పేటీఎం మాల్ వంటి ఇ కామర్స్ ప్లాట్ ఫాంలలో ఆన్‌లైన్ షాపింగ్‌పై 10% డిస్కౌంట్ పొందవచ్చు.
శాంసంగ్, రెడ్‌మీ, వన్ ప్లస్ రియల్ మీ, ఒప్పో, వివో ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ అఫర్లను పొందవచ్చు.
షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్, సెంట్రల్, ఆజీవో, ఫ్లిప్‌కార్ట్ లలో షాపింగ్ చేస్తే 10% డిస్కౌంట్, రూ .50వేల కొనుగోలుపై రూ .5,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
మేక్ మై ట్రిప్, యాత్ర,పేటీఎం నుండి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే 25శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
ఫుడ్: జోమెటో, ఇజీడినర్, స్విగి మరియు బ్రికెట్ ఖచ్చితంగా 50% వరకు తగ్గింపు.
చదవండి: క్రెడిట్ స్కోర్ బాగున్నా, లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసా?