నాస్కామ్–బీసీజీ నివేదిక ముంబై: దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ ఏటా 25–35% వృద్ధి చెందుతోంది. కంపెనీలు టెక్నాలజీపై మరింతగా ఖర్చు చేస్తుండటం, ఏఐ నిపుణులు.. ఏఐపై పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 2027 నాటికి ఇది 17 బిలియన్ డాలర్లకు చేరనుంది. టెక్నాలజీ, లీడర్ షిప్ ఫోరం 2024 సందర్భంగా సంయుక్త నివేదికలో టెక్ సంస్థల సమాఖ్య నాస్కామ్, బీసీజీ ఈ మేరకు అంచనా వేశాయి. అంతర్జాతీయంగా ఏఐపై పెట్టుబడులు 2019 నుంచి ఏటా 24% వృద్ధి చెందాయి. 2023లో 83 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువగా డేటా అనలిటిక్స్, జెన్‌ఏఐ, ఎంఎల్ అల్గోరిథమ్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.
వినూత్న సొల్యూషన్స్ ..
టెక్నాలజీ సర్విస్ ప్రొవైడర్లు సాంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధిని దాటి ఏఐ ఆధారిత వినూత్న సేవలు, సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆటోమేషన్ టూల్స్, డేటా అనలిటిక్స్ సొల్యూషన్స్‌తో పాటు హెల్త్‌కేర్, బ్యాంకింగ్ .. ఫైనాన్స్, రిటైల్ వంటి నిర్దిష్ట రంగాల అవసరాలకు అనుగుణమైన ప్రొప్రైటరీ ఏఐ.. జనరేటివ్‌ఏఐ ప్లాట్‌ఫామ్స్ కూడా వీటిలో ఉన్నట్లు వివరించింది.
► ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా ఏఐ నైపుణ్యాలున్న ప్రతిభావంతులు మూడు రెట్లు అధికంగా ఉన్నారు. గత ఏడేళ్లుగా చూస్తే ఏఐ నిపుణుల సంఖ్య 14 రెట్లు పెరిగింది. ఏఐ నిపుణుల విషయంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది.
► ఏఐలో పెట్టుబడులు పెరిగే కొద్దీ భారత్‌లో కృత్రిమ మేధ నిపుణుల సంఖ్య 2027 నాటికి వార్షికంగా 15 శాతం మేర వృద్ధి చెందనుంది.
Comments
Please login to add a commentAdd a comment