
బంగారం కొనాలని చూస్తున్న వారికి చెదువార్త. గత కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు ఒక్కసారి భారీగా పెరిగాయి. ఇవ్వాళ ఒక్కరోజే రూ.350 పైగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. న్యూఢిల్లీ బులియన్ జువెలరీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.47,208 నుంచి రూ.47,573 పైకి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ.300 పైన పెరిగి రూ.44,402 వద్ద నిలిచింది.
అయితే, హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు నేడు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.44,510గా ఉంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560గా ఉంది. వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కేజీ వెండి ధర సుమారు రూ.2000 పెరిగి కిలో రూ.65,116కు చేరింది. అంతకుముందు రోజు కిలో రూ.63158గా ఉన్న సంగతి తెలిసిందే. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.(చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: ‘ఏయ్.. వీడియోలోకి రా’)
Comments
Please login to add a commentAdd a comment