
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ఆరంభించాయి. ఈ రోజు మొత్తం బుల్ జోరు కొనసాగడంతో నిఫ్టీ జీవనకాల గరిష్ట స్థాయి 18,000కి చేరుకుంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్ రోజంతా అదే జోరును కొనసాగించాయి. ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నా దేశీ మార్కెట్ సూచీలు జోరు కొనసాగిస్తున్నాయి. కార్పోరేట్ కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్న మూడో త్రైమాసిక గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో ఇన్వెస్టర్లకు మార్కెట్‌పై నమ్మకం పెరిగింది. పిఎస్‌యు బ్యాంక్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్ స్టాక్స్ అండతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి.
చివరకు, సెన్సెక్స్ 650.98 పాయింట్లు(1.09%) పెరిగి 60,395.63 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 190.60 పాయింట్లు(1.07%) లాభపడి 18,003.30 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.04 వద్ద ఉంది. యుపీఎల్, హీరో మోటోకార్ప్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, మారుతి సుజుకి టాప్ నిఫ్టీ గెయినర్లలో ఉన్నాయి. విప్రో, నెస్లే, దివిస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్ప్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అన్ని సెక్టోరల్ సూచీలు పిఎస్‌యు బ్యాంక్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, బ్యాంక్, రియాల్టీ సూచీలు 1-3 శాతం లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం 0.7-1 శాతం పెరిగాయి.
(చదవండి: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్..!)
Comments
Please login to add a commentAdd a comment