రండి..రండి...దయచేయండి..తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ! అంటూ సుదీర్ఘ కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇంటికే పరిమితమైన ఉద్యోగుల్ని ఐటీ కంపెనీలు కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి.
► 2ఏళ్ల నుంచి ఇంటి నుంచే పనిచేస్తున్న ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు ఆహ్వానించేందుకు ఐటీ కంపెనీలు సిద్ధమయ్యాయి. కోవిడ్‌తో చాలా కంపెనీలు ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరించాలని యోచిస్తున్నప్పటికీ, ఐటీ ఉద్యోగుల వర్క్ విషయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
► అందుకే బెంగళూరు కేంద్రంగా ఐటీ కంపెనీ విప్రో మేనేజర్ స్థాయి అంతకంటే ఎక్కువ మందిని మార్చి3 లోపు తిరిగి కార్యాలయాలకు రావాలని కోరింది. అయితే, ప్రస్తుతానికి విప్రో పై స్థాయి ఉద్యోగుల్ని వారానికి రెండు రోజులు మాత్రమే పిలవనుంది.
►కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌లతో పాటు ఇతర టెక్ కంపెనీలు మార్చి నెల నుంచి ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలిపిస్తున్నాం. అందుకు మీరూ సిద్ధంగా ఉండాలంటూ ఆయా కంపెనీల ప్రతినిధులు ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్‌లో పేర్కొన్నాయి.
► కాగ్నిజెంట్ సైతం ఉద్యోగులు ఏప్రిల్ నాటికి స్వచ్ఛందంగా కార్యాలయాలకు తిరిగి వచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది వరకు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ, ఇన్ఫోసిస్ రాబోయే 3నుంచి 4 నెలల్లో ఎక్కువ మంది ఉద్యోగులతో ఆఫీస్‌లో కార్యకలాపాల్ని నిర్వహించనుంది.
► ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ ఉద్యోగులు టీకాలు వేయించుకోవడంతో పాటు, కరోనా పరిస్థితి మెరుగుపడటంతో ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయడం ప్రారంభించారని టీసీఎస్ గత వారం ఉద్యోగులకు పెట్టిన ఈమెయిల్స్‌లో తెలిపింది.
► కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం, కరోనా పరిస్థితులు చక్కబడడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న 40 నుంచి 50 శాతం మంది ఉద్యోగులు దశల వారీగా కార్యాలయాలకు రానున్నారని ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో అన్నారు.
చదవండి : బంపరాఫర్!! మీ కోసమే..ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఊహించని శాలరీలు!!
Comments
Please login to add a commentAdd a comment