
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తాజాగా సొంత ఫిన్‌టెక్ విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు.
మరోవైపు, కార్యకలాపాల డిజిటలీకరణ కోసం ప్రాజెక్ట్ డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్, వేల్యూ ఎన్‌హాన్స్‌మెంట్)ను చేపట్టామని, దీనికి కన్సల్టెంట్‌ను నియమించుకున్నామని పేర్కొన్నారు. కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా కస్టమర్లు తమ ఇంటి దగ్గరే మొబైల్ ఫోన్‌తో అన్ని సరీ్వసులను పొందగలిగేలా వివిధ ప్రక్రియలను సులభతరం చేస్తున్నట్లు మహంతి పేర్కొన్నారు.