న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ గత నెలలో రూ.2,150 కోట్ల రుణాలను జారీ చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 57 శాతం అధికం. జారీ చేసిన రుణాలు రూ.2,000 కోట్లు దాటడం వరుసగా ఇది రెండవ నెల అని కంపెనీ తెలిపింది.
వసూళ్లు ఏప్రిల్‌లో 72 శాతం, మే 67, జూన్ 90, జూలైలో 95 శాతం నమోదైతే.. ఆగస్ట్‌లో ఇది 97 శాతానికి చేరిందని వివరించింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభం, పరిస్థితులు మెరుగవడంతో నగదు రాక పెరిగి నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) తగ్గాయని వివరించింది.
‘ఇది చాలా ప్రోత్సాహకరమైన సంకేతం అని మేము నమ్ముతున్నాం. సెప్టెంబర్, రాబోయే నెలల్లో ఎన్‌పీఏలు మరింత తగ్గుతాయని భావిస్తున్నాం. కంపెనీ వద్ద సరిపడ నగదు నిల్వలు ఉన్నాయి’ అని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది.
చదవండి : పాత కార్ల అమ్మకాల్లో మహీంద్రా జోరు
Comments
Please login to add a commentAdd a comment