financial centers
-
పిరమల్ పునర్వ్యవస్థీకరణకు సై
న్యూఢిల్లీ: వ్యాపార పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు డైవర్సిఫైడ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ వీటిని రెండు లిస్టెడ్ కంపెనీలుగా విభజించనున్నట్లు వివరించింది. ఫార్మాస్యూటికల్ బిజినెస్‌ను పూర్తిగా విడదీయడం ద్వారా కన్సాలిడేట్ చేయనున్నట్లు తెలియజేసింది. పిరమల్ ఫార్మా పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటిగా పిరమల్ ఫార్మా నిలవనున్నట్లు తెలియజేసింది. ఏర్పాటు ఇలా..: బిజినెస్ విడతీతలో భాగంగా వాటాదారులకు ప్రతి 1 పిరమల్ ఎంటర్ప్రైజెస్(పీఈఎల్) షేరుకిగాను 4 పిరమల్ ఫార్మా లిమిటెడ్(పీపీఎల్) షేర్లను కేటాయించనుంది. పీఈఎల్ షేరు ముఖవిలువ రూ. 2 కాగా.. పీపీఎల్ షేరు రూ. 10 ముఖ విలువతో జారీ కానుంది. మరోవైపు పిరమల్ ఫార్మా నిర్వహణలోగల రెండు పూర్తి అనుబంధ సంస్థలను పీపీఎల్లో విలీనం చేయనుంది. తద్వారా ఫార్మా బిజినెస్ నిర్మాణాన్ని సులభతరం చేయనుంది. గత కొన్నేళ్లుగా ఒకే లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ద్వారా డైవర్సిఫైడ్ బిజినెస్‌లను గ్రూప్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. తాజాగా కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ బిజినెస్‌లను రెండుగా విడదీసేందుకు బోర్డు నిర్ణయించినట్లు తెలియజేశారు. వెరసి ఫైనాన్షియల్ సరీ్వసులు, ఫార్మా విభాగాల్లో నాయకత్వ స్థాయిలో ఉన్న స్వతంత్ర కంపెనీలుగా ఆవిర్భవించనున్నట్లు వివరించారు. కంపెనీల తీరిలా..: కాంట్రాక్ట్ తయారీ, అభివృద్ధి(సీడీఎంవో), కాంప్లెక్స్ జనరిక్స్‌లో గ్లోబల్ పంపిణీ, కన్జూమర్ ప్రొడక్టులు తదితరాలతో పిరమల్ ఫార్మా అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు అజయ్ పేర్కొన్నారు. సీడీఎంవో బిజినెస్‌లో మూడు అతి పెద్ద కంపెనీలలో ఒకటిగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఇక ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ అతిపెద్ద లిస్టెడ్ డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీలలో ఒకటిగా ఏర్పాటు కానున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్ఎల్ ఫిన్వెస్ట్ ప్రయివేట్ లిమిటెడ్‌ను పీఈఎల్లో విలీనం చేయనున్నారు. మరోపక్క డీహెచ్ఎఫ్ఎల్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో పీఈఎల్కు పూర్తి అనుబంధ కంపెనీగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కొనసాగనున్నట్లు అజయ్ వెల్లడించారు. పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 2,899 వద్ద ముగిసింది. -
రుణాలు రూ.2వేలకోట్లు పైనే, వసూళ్లు సైతం అదే స్థాయిలో
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ గత నెలలో రూ.2,150 కోట్ల రుణాలను జారీ చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 57 శాతం అధికం. జారీ చేసిన రుణాలు రూ.2,000 కోట్లు దాటడం వరుసగా ఇది రెండవ నెల అని కంపెనీ తెలిపింది. వసూళ్లు ఏప్రిల్‌లో 72 శాతం, మే 67, జూన్ 90, జూలైలో 95 శాతం నమోదైతే.. ఆగస్ట్‌లో ఇది 97 శాతానికి చేరిందని వివరించింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభం, పరిస్థితులు మెరుగవడంతో నగదు రాక పెరిగి నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) తగ్గాయని వివరించింది. ‘ఇది చాలా ప్రోత్సాహకరమైన సంకేతం అని మేము నమ్ముతున్నాం. సెప్టెంబర్, రాబోయే నెలల్లో ఎన్పీఏలు మరింత తగ్గుతాయని భావిస్తున్నాం. కంపెనీ వద్ద సరిపడ నగదు నిల్వలు ఉన్నాయి’ అని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది. చదవండి : పాత కార్ల అమ్మకాల్లో మహీంద్రా జోరు -
మాతాశిశు సంక్షేమంలోనూ కాసుల కక్కుర్తి
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అరకొరే అక్కరకు రాని అంగన్వాడీలు తల్లీబిడ్డల ఆరోగ్యానికి కనిపించని భరోసా మాతాశిశు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లోపభూయిష్టంగా మారాయి. ఫలితంగా తల్లీబిడ్డ క్షేమం ప్రశ్నార్థకమవుతోంది. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు గర్భిణులకు అందించే పౌష్టికాహారాన్ని సైతం అక్రమార్కులు బొక్కేస్తున్నారు. ఆరోగ్యశాఖ అందించాల్సిన వైద్య సేవల్లోనూ కాసుల కక్కుర్తి కొనసాగుతోంది. శిశుమరణాలు తగ్గించేందుకు ఆస్పత్రి కాన్పులను ప్రోత్సహిస్తూ బాలింతలకు అందించే రూ.1000 లోనూ కమీషన్ల కోతలు తప్పడం లేదు. సాక్షి, మచిలీపట్నం : తల్లీబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గర్భిణులకు అందించే పౌష్టికాహారం దశలోనే అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పాటు గర్భిణులకు అందించే ఆహారం కూడా అరకొరగానే ఉంటోంది. దీంతో జిల్లాలో ఏటా వేలాదిమంది గర్భిణులు కష్టాల ప్రసవ వేదన అనుభవిస్తున్నారు. జిల్లాలో 3,556 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా సుమారు 32 వేల 119 మంది గర్భిణులు, 32 వేల 560 మంది బాలింతలకు పౌష్టికాహారం అందించాల్సి ఉంది. మొత్తం 64 వేల 679 మందిలో ఒక్కొక్కరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా నెలకు కిలో కందిపప్పు, మూడు కిలోల బియ్యం, వారానికి నాలుగు కోడిగుడ్లు, నెలకు 450 గ్రాముల ఆయిల్ ఇవ్వాల్సి ఉంది. మిగిలిన సరకులు అరకొరగా ఇస్తుండగా చాలా కేంద్రాల్లో గుడ్లు ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చే పెసరపప్పు, గోధుమరవ్వ, బియ్యం, బెల్లం, ఆకు కూరలు వంటివి ఇవ్వడమే మానేశారు. దవాఖానాల్లోనూ దోపిడీయే... తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం వైద్య ఆరోగ్య శాఖ అందించాల్సిన సేవల్లోనూ కాసుల కక్కుర్తి తప్పడంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ గర్భిణులకు ధనుర్వాతం రాకుండా రెండు టీటీ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో కొన్నిచోట్ల టీటీ ఇంజక్షన్లు చేయాలని డబ్బులు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. గర్భిణులకు బలం కోసం 100 ఐరన్ మాత్రలు ఇవ్వాల్సి ఉండగా, అవి ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో లేవు.. బయట కొనుక్కోండి అంటూ చీటీ రాసి చేతిలో పెడుతున్నారు. వారికి ఉచితంగా నిర్వహించాల్సిన రక్త, హెచ్ఐవీ తదితర పరీక్షలకు సైతం డబ్బులు దండుకుంటున్నారు. డబ్బులెందుకు ఇవ్వాలని అడిగితే అవే పరీక్షలు బయట ల్యాబరేటరీల్లో చేయించుకోమని రాసి ఇస్తున్నారు. ప్రోత్సాహకాల్లోనూ కోత... ఆస్పత్రి కాన్పులను ప్రోత్సహించేందుకు ఇచ్చే రూ.1000 సొమ్ము విషయంలోనూ కక్కుర్తికి పాల్పడుతున్నారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నుంచి ఇచ్చే ఈ పారితోషికం గతంలో కాన్పు అయిన వెంటనే ఆయా ఆస్పత్రుల్లోనే నేరుగా ఇచ్చేవారు. నేరుగా నగదు పంపిణీ చేయడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఆ తర్వాత చెక్కులు ఇస్తోంది. ఇటీవల గర్భిణుల పేరుతో బ్యాంకు ఖాతా తెరిపించి ప్రసవం అనంతరం బ్యాంకులో సొమ్ము జమ చేస్తోంది. ఖాతాలు తెరవడంలో వ్యయప్రయాసలకు గురవుతున్న గర్భిణుల నుంచి మాత్రం గ్రామస్థాయి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రూ.100 నుంచి 200 వరకు వసూలు చేస్తుండటం బాధాకరం.