సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఎలక్ట్రిక్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. కొనుగోలుదార్లకు వస్తువుల సరఫరాకు ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించనున్న అమెజాన్ ఈ మేరకు మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌తో మంగళవారం డీల్ కుదుర్చుకుంది. సుమారు ఏడు నగరాల్లో లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే మహీంద్రా ‘ట్రెయో జోర్’ త్రీ వీలర్ వంద ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ సహా బెంగళూరు, న్యూ ఢిల్లీ లాంటి ప్రధాన మెట్రో నగరాల్లో వీటిని వినియోగించనున్నట్టు తెలిపింది. (అమెజాన్‌కు ఊరట: సుప్రీం కీలక ఉత్తర్వులు)
ఈ డీల్‌పై మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సీఎండీ మహేష్ బాబు సంతోసం వ్యక్తం చేశారు. కార్బన్ ఉద్గారాలను నివారించి, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అమెజాన్‌తో భాగస్వామ్యం కావడం గర్వకారణమన్నారు. ట్రెయో జోర్ 8 కిలోవాట్ల అత్యుత్తమ పరిశ్రమ శక్తితో, 550 కిలోల అత్యధిక తరగతి పేలోడ్‌తో ప్రత్యేకమైన కస్టమర్ విలువ విలువైన సేవలను అందిస్తుందన్నార. గత ఏడాది జనవరిలో కంపెనీ ప్రకటించిన విధంగా 2025 నాటికి అమెజాన్ ఇండియా తన డెలివరీ వాహనాల సముదాయంలో 10 వేల ఎలక్ట్రిక్ వాహనాలను విని యోగించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుందని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 2025-26 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఎలక్ట్రిక్ వెహికల్ త్రీ వీలర్ విభాగంలో మహీంద్రా ట్రె జోర్‌కు 56 శాతం మార్కెట్ వాటా ఉంది. అమెజాన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్, బిగ్‌బాస్కెట్, దేశంలోని ఇతర ఈకామర్స్‌సంస్థలు మహీంద్ర ఈ వాహనాలను వినియోగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment