హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థ మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా ప్రోహెల్త్ ప్రైమ్ పేరిట హెల్త్ పాలసీని ఆవిష్కరించింది. ఆస్పత్రి చికిత్స వ్యయాలకు మాత్రమే పరిమితం కాకుండా క్యాష్‌లెస్ అవుట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ వ్యయాలకు (డాక్టర్ కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, ఫార్మసీ ఖర్చులు మొదలైనవి) కూడా కవరేజి అందించడం ఈ పాలసీ ప్రత్యేకత అని సంస్థ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు.
కస్టమర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై తాము నిర్వహించిన అధ్యయనంలో దేశీయంగా అవుట్‌పేషంట్ డిపార్ట్ వ్యయాలు మొత్తం హెల్త్‌కేర్ ఖర్చుల్లో 62 శాతం స్థాయిలో ఉంటున్నాయని, ఆస్పత్రిలో చేరితే బిల్లులో వైద్యయేతర వ్యయాలు 10–12% మేర ఉంటున్నాయని తేలినట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే సమగ్రమైన బీమా పాలసీని అందించాలనే ఉద్దేశంతో ప్రోహెల్త్ ప్రైమ్‌ను రూపొందించినట్లు సిక్దర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment