ముంబై, సాక్షి: మళ్లీ యూరోపియన్ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుండటంతో తాజాగా హెల్త్‌కేర్ రంగం వెలుగులోకి వచ్చింది. సెకండ్‌వేవ్‌లో భాగంగా ఇప్పటికే యూస్, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బ్రిటన్‌లో వైరస్ కొత్త రూపంలో విస్తరిస్తున్నట్లు వెలువడిన వార్తలు ఓవైపు మార్కెట్లను దెబ్బతీస్తుంటే.. మరోపక్క ఔషధ కంపెనీలకు డిమాండ్‌ను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఓవైపు కోవిడ్-19 కట్టడికి కొత్త ఏడాది(2021)లో పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నప్పటికీ మరికొంత కాలం వైరస్ సంక్షోభం కొనసాగనున్నట్లు ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా హెల్త్‌కేర్, ఫార్మా కౌంటర్లు జోరందుకున్నాయి. వెరసి బీఎస్‌ఈలో హెల్త్‌కేర్ ఇండెక్స్ 21,644 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగం 12,870 సమీపంలోనూ సరికొత్త గరిష్టాలు చేరాయి. అయితే ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమై 46,660కు చేరగా.. నిఫ్టీ 98 పాయింట్లు క్షీణించి 13,662 వద్ద ట్రేడవుతోంది. (మెడ్‌ప్లస్‌పై వార్‌బర్గ్ పింకస్ కన్ను!)
షేర్ల జోరిలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం సిప్లా 2 శాతం బలపడి రూ. 810 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 817కు ఎగసింది. తొలుత రూ. 905ను తాకిన అరబిందో ప్రస్తుతం 1.2 శాతం పుంజుకుని రూ. 896 వద్ద కదులుతోంది. ఈ బాటలో లుపిన్ 1 శాతం పెరిగి రూ. 983 వద్ద, సన్ ఫార్మా 1 శాతం బలపడి రూ. 580 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో లుపిన్ రూ. 992 వద్ద, సన్ ఫార్మా రూ. 586 వద్ద గరిష్టాలకు చేరాయి. కాగా.. ఎక్స్‌బోనస్ నేపథ్యంలో వేలియంట్ ఆర్గానిక్స్ 3 శాతం పురోగమించి రూ. 3400 వద్ద కదులుతోంది. తొలుత రూ. 3,488 వరకూ బలపడింది. ఇక బీఎస్‌ఈలో నెక్టార్‌లైఫ్, సువెన్ ఫార్మా, జూబిలెంట్, మెట్రోపోలిస్, మార్క్‌సాన్స్, ఇండొకో, గ్లెన్‌మార్క్, లాల్‌పాథ్, ఆస్ట్రాజెనెకా, లారస్ ల్యాబ్స్ 10-1 శాతం మధ్య జంప్‌చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment