ఎన్‌డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు కావొస్తున్న నేపథ్యంలో రూ.మూడు లక్షల కోట్ల ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు ఆమోదం లభించింది. ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలు పెంపొందించడం, ఆర్థిక వృద్ధిని సులభతరం చేయడం, ఉద్యోగాల కల్పనకు ఈ ప్రాజెక్ట్‌లు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఓడరేవుల రంగంలో మహారాష్ట్రలోని వధావన్ వద్ద రూ.76,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పోర్ట్‌కు ఇటీవలే ఆమోదం లభించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోని టాప్ 10 ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన - IV కింద 62,500 కి.మీ రోడ్ల నిర్మాణంతోపాటు రోడ్లపై వంతెనల నిర్మాణం కోసం రూ.49,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభించనున్నారు. రూ.50,600 కోట్ల అంచనా వ్యయంతో 936 కి.మీ విస్తరించి ఉన్న ఎనిమిది జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్లిష్టమైన భూభాగాల్లోనూ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా లద్దాఖ్‌ను హిమాచల్ ప్రదేశ్‌తో కలుపుతూ షింఖున్ లా టన్నెల్ ఏర్పాటుకు ఇటీవల ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి: ‘డిపాజిట్’ వార్!
రైల్వే ప్రయాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా మొదటి వంద రోజుల్లో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను ఆమోదించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.42 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం, బిహార్‌లోని బిహ్తాలో కొత్త సివిల్ ఎన్‌క్లేవ్‌లతో పాటు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ప్రభుత్వ ఆమోదం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment