infra project
-
వంద రోజుల్లో రూ.మూడు లక్షల కోట్ల పనులకు ఆమోదం
ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు కావొస్తున్న నేపథ్యంలో రూ.మూడు లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లకు ఆమోదం లభించింది. ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలు పెంపొందించడం, ఆర్థిక వృద్ధిని సులభతరం చేయడం, ఉద్యోగాల కల్పనకు ఈ ప్రాజెక్ట్‌లు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు.ఓడరేవుల రంగంలో మహారాష్ట్రలోని వధావన్ వద్ద రూ.76,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పోర్ట్‌కు ఇటీవలే ఆమోదం లభించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోని టాప్ 10 ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన - IV కింద 62,500 కి.మీ రోడ్ల నిర్మాణంతోపాటు రోడ్లపై వంతెనల నిర్మాణం కోసం రూ.49,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభించనున్నారు. రూ.50,600 కోట్ల అంచనా వ్యయంతో 936 కి.మీ విస్తరించి ఉన్న ఎనిమిది జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్లిష్టమైన భూభాగాల్లోనూ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా లద్దాఖ్‌ను హిమాచల్ ప్రదేశ్‌తో కలుపుతూ షింఖున్ లా టన్నెల్ ఏర్పాటుకు ఇటీవల ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.ఇదీ చదవండి: ‘డిపాజిట్’ వార్!రైల్వే ప్రయాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా మొదటి వంద రోజుల్లో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను ఆమోదించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.42 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా విమానాశ్రయం, బిహార్‌లోని బిహ్తాలో కొత్త సివిల్ ఎన్‌క్లేవ్‌లతో పాటు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ప్రభుత్వ ఆమోదం లభించింది. -
రూ.6.5 లక్షల కోట్లతో సాగర్మాల.. ఎందుకీ భారీ ప్రాజెక్టు?
న్యూఢిల్లీ: సాగర్మాల కార్యక్రమం కింద రూ.6.5 లక్షల కోట్ల విలువైన 1,537 ప్రాజెక్టులను అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. తీరప్రాంత జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూ.58,700 కోట్ల వ్యయ అంచనాలతో 567 ప్రాజెక్టులను గుర్తించినట్టు మంత్రి వెల్లడించారు. సాగర్మాల దేశవ్యాప్తంగా 7,500 కిలోమీటర్ల పొడవున ఉన్న సాగర తీరాన్ని ఉపయోగించుకుంటూ, పోర్టుల ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర సర్కారు సాగర్మాల కార్యక్రమాన్ని తలపెట్టింది. అలాగే, 14,500 కిలోమీటర్ల పొడవునా జలమార్గాలను కూడా ఉపయోగించుకోవాలన్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. శుక్రవారం ఢిల్లీలో నేషనల్ సాగర్మాల అపెక్స్ కమిటీ (ఎన్సాక్) సమావేశం అనంతరం మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. సాగర్మాల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించినట్టు చెప్పారు. అమలు దశలో.. 2035 నాటికి రూ.5.5 లక్షల కోట్లతో 802 ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు మంత్రి సోనోవాల్ తెలిపారు. వీటిల్లో రూ.99,281 కోట్లతో 202 ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేసినట్టు వెల్లడించారు. మరో 29 ప్రాజెక్టులను (రూ.45,000 కోట్లు) ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద విజయవంతంగా అమలు చేసినట్టు తెలిపారు. రూ.51,000 కోట్ల విలువ చేసే మరో 32 ప్రాజెక్టులు పీపీపీ అమలు దశలో ఉన్నట్టు పేర్కొన్నారు. రూ.2.12 లక్షల కోట్ల విలువ చేసే 200 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇవి రెండేళ్లలో పూర్తవుతాయని తెలిపారు. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గాలి.. ఈ సందర్భంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. రవాణా వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో లాజిస్టిక్స్ వ్యయాలు 8 శాతమే ఉంటే, మన దగ్గర 14–16 శాతం మధ్యలో ఉన్నట్టు చెప్పారు. ఇక్కడా 8 శాతానికి తగ్గిస్తే ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. చదవండి: జూలై నాటికి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు -
స్కూళ్లూ, జైళ్లూ కూడా ప్రైవేట్‌పరం చేయాలి
♦ ఇన్ఫ్రా ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి ♦ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ న్యూఢిల్లీ: ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. కెనడా.. ఆస్ట్రేలియా వంటి దేశాల తరహాలోనే స్కూళ్లు, కాలేజీలు, జైళ్లను కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన ఇండియా పీపీపీ సదస్సు 2017లో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించింది. కానీ నిర్వహణ మాత్రం గొప్పగా చేయలేదు. అందుకే ప్రభుత్వం రివర్స్ బాట్ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానానికి మళ్లాలి.. ప్రాజెక్టులను విక్రయించేసి, నిర్వహణను ప్రైవేట్ రంగానికే అప్పగించాలి‘ అని కాంత్ చెప్పారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాల్లోని బాత్రూమ్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని ఉదహరిస్తూ.. ఇలాంటివన్నీ ప్రైవేట్ రంగానికి అప్పగించాలని సూచించారు. -
మౌలికానికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అండ
న్యూఢిల్లీ: దేశీ మౌలిక రంగానికి అవసరమైన నిధులను అందించేందుకు వీలుగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇన్ఫ్రా డెట్ ఫండ్(ఐఐడీఎఫ్) ఐదు సాధారణ బీమా ప్రభుత్వ రంగ సంస్థలతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. దీనిలో భాగంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఐడీఎఫ్తో కలసి దేశీయంగా మౌలిక రంగ అభివృద్ధికి కృషి చేస్తాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ సమక్షంలో ఎంవోయూపై ఆయా కంపెనీల సీఈవోలు సంతకాలు చేశారు. ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లకు అవసరమయ్యే నిధులను చౌకగా సమీకరించేందుకు ఈ కొత్తతరహా విధానం ఉపయోగపడుతుందని మాయారామ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎంవోయూ కుదుర్చుకున్న ప్రతీ సంస్థా 20% వరకూ నిధులను(కార్పస్) సమకూర్చనున్నట్లు తెలిపారు. ఇకపై ఇన్ఫ్రా నిధుల సమీకరణలో బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ కీలకంగా నిలిచే అవకాశమున్నదని తెలిపారు. ఇప్పటికే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ప్రభుత్వ బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 125 కోట్లను ఇన్వెస్ట్ చేసింది.