ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతూ విధ్వంసాన్నే సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు దాని మిత్రదేశాలు..సైనికులు, ఆయుధాల్ని సరఫరా చేస్తున్నాయి. పలువురు వ్యాపార వేత్తలు సైతం ఈ రష్యా దాడుల్ని ఖండిస్తూ ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కో-ఫౌండర్, చైర్మన్ కో-సీఈఓ రీడ్ హేస్టింగ్స్ ఉక్రెయిన్‌కు 1మిలియన్ విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.
రష్యా ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తాం
ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ పై రష్యా దాడి భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి. ఎమర్జెన్సీ సైరన్ కూతలు... చెవులు చిల్లుపడే బాంబుల మోతలు... గాలిలో చక్కర్లు కొడుతున్న సైనిక హెలికాప్టర్లు...ఎక్కడ సురక్షితమో అర్థం కాక పారిపోవాలన‍్న ఆందోళనలతో అక్కడి ప్రజలు క్షణం క్షణం బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.
అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గని ఉక్రెయిన్ మాత్రం రష్యా ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తాం అంటూ సవాల్ విసురుతుంది. ఇందులో భాగంగానే రష్యన్ మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవిట్‌స్కీని హత మార్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment