Netflix Bans Over 1 Million User Accounts, Deets Inside - Sakshi
Sakshi News home page

తగ్గేదేలే: నెట్‌ ఫ్లిక్స్‌ షాకింగ్‌ నిర్ణయం, లక్షల అకౌంట్లు బ్యాన్‌!

Published Wed, Jun 1 2022 5:07 PM | Last Updated on Wed, Jun 1 2022 6:59 PM

Netflix Bans Over 1 Million User Accounts - Sakshi

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. సుమారు 1మిలియన్‌ యూజర్ల అకౌంట్‌లను బ్లాక్‌ చేస‍్తున్నట్లు ప్రకటించింది. అయితే నెట్‌ ఫ్లిక్స్‌ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందనే అంశంపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ జోరుగా సాగుతుంది. 


వికీపీడియా లెక్కల ప్రకారం
వికీపీడియా లెక్కల ప్రకారం..ఉక్రెయిన్‌ ఆక్రమణే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ యుద్ధానికి తెరలేపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పుతిన్‌ నిర్ణయాన్ని తొలిసారి వ్యతిరేకిస్తూ మార్చి నెలలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ రష్యాలో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అందుకు రష్యా ప్రభుత్వ ప్రతినిధి  తమ దేశంలో నెట్‌ఫ్లిక్స్‌పై నిషేధం విదిస్తూ కౌంటర్‌ ఇచ్చారు. 

అప్పుడు ప్రకటనకే పరిమితం
మార్చి నెలలో రష్యాలో తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తూ నెట్‌ ఫ్లిక్స్‌ యాజమాన్యం ప్రకటించింది. కానీ నెట్ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్ షేర్ చేస్తే అదనఫు ఛార్జీలు వసూలు చేస్తున్నామనే ప్రతిపాదన తెచ్చింది. ఆ ప్రతిపాదనే ఓటీటీ కొంప ముంచింది. సుమారు 6 బిలియన‍్లు (భారత కరెన్సీలోరూ. 4,65,09,36,00,000.00) నష్టపోయేలా చేసింది. 


మళ్లీ ఇప్పుడు 
రెండు నెలల విరామం తర్వాత నెట్‌ ఫ్లిక్స్‌ రష్యాలో బ్యాన్‌ చేసింది. అంతేకాదు 1 మిలియన్‌ సబ్‌ స్క్రిప్షన్‌ యూజర్ల అకౌంట్‌లను బ్లాక్‌ చేసింది. నెట్‌ ఫ్లిక్స్‌ తాజాగా నిర్ణయంతో రష్యాలో ఇకపై ఆ సంస్థ సేవలు నిలిచి పోనున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ సేవలు ఆగిపోవడంతో వీపీఎన్‌ సర్వర్‌ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సెస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజిన్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రేంజర్‌ థింగ్స్‌ను వీపీఎన్‌లో వీక్షించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
  
మేం ఒప్పుకోం 
ఎంటర్‌ టైన్‌మెంట్‌ విభాగంలో నెట్‌ ప్లిక్స్‌ రష్యాలో కీరోల్‌ ప్లే చేస్తుంది. నెట్‌ ప్లిక్స్‌ ను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటన రావడంతో రష్యన్‌ ప్రజలు నెట్‌ ఫ్లిక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రకటన లేకుండా తమ దేశంలో నెట్‌ ఫ్లిక్స్‌ను ఎందుకు బ్యాన్‌ చేస‍్తుందని మండిపడ్డారు. పలువురు సబ్‌ స్క్రైబర్లు కోర్ట్‌ను ఆశ్రయించారు. నెట్‌ఫ్లిక్స్‌ తమకు 60 మిలియన్‌ రష్యన్‌ రూబెల్స్‌(రూ.7.6కోట్లు) లో నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

బ్యాన్‌ లిస్ట్‌లో నెట్‌ప్లిక్స్‌ 
ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తున్న రష్యాను విదేశీ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు రష్యాలో ఉండి కార్యకాలు నిర్వహిస్తున్న ఇతర దేశాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ఆదేశాన్ని విడిచిపెడుతున్నాయి. ఇప్పటికే  మెక్‌ డొనాల్డ్‌, కోకోకోలా, స్టార్‌ బక్స్‌తో పాటు వెయ్యికి పైగా రష్యాలో సేవల్ని నిలిపివేశాయి. తాజాగా రష్యాలో సేవల్ని నిలిపివేసిన జాబితాలో నెట్‌ ఫ్లిక్స్‌ చేరింది.

చదవండి👉 ఆ కక్కుర్తితో వందల కోట్ల హాంఫట్,నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారులారా బుద్ధొచ్చింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement