న్యూఢిల్లీ: గడిచిన ఎనిమిది నెలల్లో తమ ప్లాట్‌ఫామ్‌పై కొత్త ఇన్వెస్టర్ల రిజి్రస్టేషన్ల సంఖ్య కోటి మార్కును దాటినట్లు స్టాక్ ఎక్సే్చంజీ ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. దీనితో మొత్తం ఇన్వెస్టర్ల సంఖ్య 8 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఈ కోటి కొత్త ఖాతాల్లో ఉత్తరాది ఇన్వెస్టర్ల వాటా 43 శాతంగా ఉండగా, పశి్చమం (27 శాతం), దక్షిణాది (17 శాతం), తూర్పు రాష్ట్రాలు (13 శాతం) తర్వాత వరుసలో ఉన్నాయి.
నగరాలవారీగా చూస్తే ఢిల్లీ (7 శాతం), ముంబై (4.6 శాతం), పుణె (1.7 శాతం) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. డేటా ప్రకారం దేశీయంగా 17 శాతం కుటుంబాలు తమ ట్రేడింగ్ సభ్యుల నెట్‌వర్క్ ద్వారా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించింది. క్లయింట్లు పలు బ్రోకరేజీల ద్వారా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో క్లయింట్ల ఖాతాల సంఖ్య 14.9 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఆకర్షణీయ పనితీరు కనపరుస్తున్న నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్లపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోందని ఎన్‌ఎస్‌ఈ వివరించింది. 2022–23లో కొత్త ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్ సంఖ్య 1.3 కోట్లుగా ఉండగా, 2021–22లో 1.9 కోట్లుగాను, 2020–21లో 0.90 కోట్లుగాను నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment