Stock Market Live Updates: Nifty ends above 17,400, Sensex gains 657 pts on Feb 9th - Sakshi
Sakshi News home page

బుల్ జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Published Wed, Feb 9 2022 4:09 PM | Last Updated on Wed, Feb 9 2022 4:49 PM

Nifty ends above 17,400, Sensex gains 657 pts on Feb 9th - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం కొద్దిగా తడబడిన ఆ తర్వాత తిరిగి పుంజుకున్నాయి. గత వారం రోజులుగా కొనసాగుతున్న నష్టాలతో చాలా షేర్ల ధరలు కనిష్టాలకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు భారీ ఎత్తున ఆసక్తి చూపించారు. అలాగే, ఐటీ & ఆర్థిక రంగాల షేర్లు పుంజుకోవడంతో సూచీలు లాభాల వైపు పయనించాయి. ముగింపులో, సెన్సెక్స్ 657.39 పాయింట్లు (1.14%) పెరిగి 58,465.97 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 197 పాయింట్లు (1.14%) లాభపడి 17,463.80 వద్ద సెషన్​ను ముగించింది.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.76 వద్ద ఉంది. కోల్​ ఇండియా, మారుతీ సుజుకీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, బజాజ్​ ఆటో, హిందాల్కో షేర్లు రాణిస్తే.. ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, ఐటీసీ, ఐఓసీ, పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​ డీలాపడ్డాయి. చమురు & గ్యాస్, పీఎస్​యూ బ్యాంక్​లు మినహా అన్ని ఇతర సెక్టార్ సూచీలు క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఐటి, మెటల్ బ్యాంక్ 1-2 శాతం లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.6-1.2 శాతం లాభపడ్డాయి.

(చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. వెంటనే ఈ డాక్యుమెంట్స్ ఫైల్ చేయండి..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement