
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతదంగా ఉంచడం, అంతర్జాతీయంగా మార్కెట్లు లాభాల్లో కొనసాగడంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 460.06 పాయింట్లు (0.79%) లాభపడి 58926.03 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 142 పాయింట్లు 0.81% పెరిగి 17605.80 వద్ద నిలిచింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.95 వద్ద ఉంది. నిఫ్టీలో ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసీస్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. మారుతి సుజుకి, బీపీసీఎల్, శ్రీ సిమెంట్స్, ఐఓసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. అన్ని సెక్టోరల్ సూచీలు ఐటీ, బ్యాంక్, పవర్, మెటల్ ఒక్కొక్కటి 1 శాతం వరకు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.
(చదవండి: కొత్త ఇంటిని కొనుగోలు చేసే వారికి శుభవార్త..! ఇదే సరైన సమయం..!)