
ముంబై: మూడు రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు పడుతూ లేస్తూ చివరికి భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరడంతో వడ్డీరేట్ల పెంపును ఫెడ్ మరింత వేగంగా పెంచనుందన్న భయాలు, వృద్ధిరేటుని ఆర్బీఐ తగ్గించడం వంటి కారణాలతో సూచీలు నష్టాల్లో ముగిశాయి.
ముగింపులో, సెన్సెక్స్ 773.11 పాయింట్లు(1.31%) క్షీణించి 58,152.92 వద్ద ఉంటే, నిఫ్టీ 231 పాయింట్లు (1.31%) నష్టపోయి 17,374.80 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.41 వద్ద ఉంది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఐఓసీ షేర్లు రాణిస్తే.. గ్రాసీమ్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యుపీఎల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం నష్ట పోవడంతో నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి దాదాపు 2 శాతం పడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment