ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' కాసేపట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తద్వారా.. వరుసగా ఎనిమిదిసార్లు పద్దును సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డుల్లోకి ఎక్కనున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ఈసారి బడ్జెట్ ఉండనున్నట్లు కేంద్రం ఇప్పటికే సంకేతాలిచ్చింది. అంతే కాకుండా.. మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించే కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రధాని మోదీ మాటలను బట్టి అర్థమవుతోంది.
ఇప్పటి వరకు ఏడు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఎనిమిదోసారి బడ్జెట్ చదవనున్నారు. ఇప్పటి వరకు ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సొంతం. ఈయన 10 బడ్జెట్‌లను ప్రవేశపట్టారు. సీతారామన్ కూడా ఈ సంఖ్యకు చేరువలో ఉన్నారు. సుదీర్ఘంగా బడ్జెట్ ను చదివి వినిపించిన ఘనత కూడా ఈమె సొంతం చేసుకున్నారు.
బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు
➤భారతదేశంలో మొట్టమొదటిసారి 1947 నవంబర్ 26న 'షణ్ముఖం చెట్టి' బడ్జెట్ సమర్పించారు.
➤అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు.
➤ఫిబ్రవరి 1, 2020న నిర్మలా సీతారామన్ 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.
➤1977లో హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం.. ఇప్పటివరకు అతి చిన్న బడ్జెట్‌గా నిలిచింది. ఎందుకంటే ఇది కేవలం 800 పదాలతో కూడిన బడ్జెట్.
➤ప్రారంభంలో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించేవారు. కానీ 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో సమయాన్ని మార్చారు. అప్పటి నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు.
➤2017లో బడ్జెట్ సమర్పణ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. అప్పటి వరకు ఫిబ్రవరి 29న బడ్జెట్ సమర్పించేవారు.
Comments
Please login to add a commentAdd a comment