2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే శుభవార్త చెప్పారు. ముంబైలోని ఐదు టోల్ బూత్‌లలో లైట్ వెయిట్ మోటారు వాహనాలకు టోల్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇది ఈ రోజు (అక్టోబర్ 14) అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో టోల్ ఫీజు మినహాయింపుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించాలంటే దహిసర్ టోల్, ఆనంద్ నగర్ టోల్, వైశాలి, ఐరోలి, ములుండ్ వంటి టోల్ ప్లాజాల గుండా రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ టోల్ ప్లాజాల గుండా వచ్చే లైట్ వెయిట్ వాహనాలకు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పొలిటికల్ స్టంట్ కాదు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోలేదు. టోల్ ఫీజుల మినహాయింపు కేవలం ఎన్నికల పూర్తయ్యే వరకు మాత్రమే కాకుండా.. శాశ్వతంలో అమలులో ఉండేలా చేశాము. దీనిపై విమర్శలు చేస్తున్న ప్రతి పక్షాలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిన చరిత్ర ఉందని సీఎం ఏక్‌నాథ్‌షిండే అన్నారు.
టోల్ ఫీజుల మినహాయింపు హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్‌యూవీలు, జీపులు, వ్యాన్‌లు, ఆటో రిక్షాలు, టాక్సీలు, డెలివరీ వ్యాన్‌లకు వర్తిస్తుంది. ప్రతి రోజూ సుమారు ఆరు లక్షల కంటే ఎక్కువ వాహనాలు ముంబైని దాటుతున్నాయి. ఇందులో 80 శాతం లైట్ వెయిట్ వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న టోల్ ఫీజుల మినహాయింపు వీరందరికీ ఉపశమనం కలిగిస్తుంది.
ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'
ఇకపైన ముంబైలో టోల్ ఫీజు చెల్లించే వాహనాల జాబితాలో ట్రక్కులు, లారీలు వంటి భారీ వాహనాలు మాత్రమే ఉంటాయి. ఈ వాహనాలకు యధావిధిగా టోల్ ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. అయితే మహారాష్ట్ర సీఎం టోల్ ఫీజుల మినహాయింపుపై తీసుకున్న నిర్ణయం కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
#WATCH | Maharashtra Govt announces full toll exemption for all light motor vehicles entering Mumbai.
Maharashtra minister Dadaji Dagadu Bhuse says "At the time of entry into Mumbai, there were 5 toll plazas, including Dahisar toll, Anand Nagar toll, Vaishali, Airoli and Mulund.… pic.twitter.com/jTsy4nKvN2— ANI (@ANI) October 14, 2024
Comments
Please login to add a commentAdd a comment