జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు వాడవాడల ఘనంగా జరిగాయి. పల్లెపట్నం తేడా లేకుండా అన్ని చోట్ల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్కూల్లు, కార్యాలయాలు, స్వచ్చంధ సంస్థలు అన్ని ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యాయి. కానీ ఒక హిల్ ఏరియాకి చెందిన చిన్నారులు నిర్వహించిన వేడుక మిగిలిన వాటికి భిన్నంగా నిలిచింది. ఎక్కడో ముంబైలో ఉన్న ఆనంద్ మహీంద్రా ఆ వేడుకలు గుర్తించేలా చేసింది.
కల్మషం లేని మనుసుతో ఎంతో ఉత్సాహంతో తమ దగ్గరున్న వనరులతోనే ఆ చిన్నారులు వేడుకలు నిర్వహించారు. అచ్చంగా రిపబ్లిక పరేడ్‌ను తలపించేలా కొందరు లయబద్దంగా శబ్ధం చేస్తూంటే మధ్యలో మరో బుడత సైనిక కవాతు నిర్వహించాడు. ఆ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా వెంటనే తన పేజీపై షేర్ చేశారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఆ చిన్నారుల ఉత్సాహం, వనరులను వారు వినియోగించుకున్న తీరు ముచ్చటగా ఉంది. జాతీయ వేడుకలకు సంబంధించి గొప్ప వాటిలో ఇదీ ఒకటి అన్నట్టుగా కామెంట్ చేశారు.
This just showed up in my #signalwonderbox No idea which state it’s from. But to me, their enthusiasm & resourcefulness made this one of the grandest Republic Day celebrations. pic.twitter.com/Uk2kfVFKC2
— anand mahindra (@anandmahindra) January 28, 2022
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కి నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ చిన్నారులు పరేడ్ ఎంతో బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది పాత వీడియో అంటూ చెప్పగా.. వీడియో ఎప్పటిదైనా ఇండియన్ అనే ఫీలింగ్ ఎప్పుడు ఎనర్జీ ఇస్తుందంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
చదవండి: సామాన్యుడితో ఆనంద్ మహీంద్రా డీల్ పూర్తి.. పాత బండికి కొత్త బొలెరో అందజేత
Comments
Please login to add a commentAdd a comment