ఇంటికి రంగులు వేయడం ఒక కళ. జీవితకాలం కష్టపడి సొంతం చేసుకునే సొంతింటికి రంగుల ఎంపిక ఆషామాషీ వ్యవహారం కాదు. కలర్స్ ఇంటికి అందాన్ని, అనుభూతిని తీసుకురావడమే కాదు యజమాని అభిరుచిని, మానసిక స్థితిని తెలియజేసేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కంటికి, మనసుకు ఆహ్లాదకరమైన రంగులతో రోజువారీ జీవితం రంగులమయం అవుతుంది. మనిషి ఇంద్రియాలు రంగులతో కనెక్ట్ అవుతాయి. స్పర్శ, రుచి, సువాసనలు మనలో భావోద్వేగాలను కలిగిస్తాయి. అందుకే ఇంటీరియర్‌లో రంగులు, వాటి ఎంపికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రకృతి, ఆహార్యం, సువాసన, మృదుత్వం, ప్రకాశవంతం వంటి వాటితో రంగులు నివాసితులు, చూపరులకు సరికొత్త అనుభూతులను అందిస్తుంది.

సోలార్ ఎల్లో..
సోలార్ ఎల్లోగా పిలవబడే ఈ రంగు ప్రస్తుతం ఇంటీరియర్‌లో ట్రెండ్‌గా మారింది. సూర్యుని నిజమైన రంగు తెలుపు. కానీ, మన వాతావరణం, దాని కాంతిని వెదజల్లే విధానం కారణంగా భూమి నుంచి చూస్తే సూర్యుని రంగు పసుపు, నారింజ, ఎరుపు రంగులలో కనిపిస్తుంది. అలాగే సోలార్ ఎల్లో రంగు కూడా వాతావరణాన్ని బట్టి రంగులు మారుతున్న అనుభూతిని కల్పిస్తుంది.
స్వచ్ఛమైన కాంతి, ప్రకాశవంతంగా ఉత్తేజకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. లక్కర్డ్ ఫర్నిచర్, గాజు ఫినిషింగ్‌తో కఠినమైన, కాంతిని ప్రతిబింబించే ఉపరితలంగా సోలార్ ఎల్లో అందంగా ఉంటుంది. దీని మెరుపులు, మృదుత్వం ఉల్లాసభరితంగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్!


