ఎలాన్‌ మస్క్‌తో భేటీ కానున్న ప్రధాని మోదీ.. టెస్లాకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌? | Pm Modi To Meet Tesla Elon Musk In Us Tour | Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్‌తో భేటీ కానున్న ప్రధాని మోదీ..భారత్‌లో టెస్లా కార్ల తయారీ, అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌!

Published Tue, Jun 20 2023 4:32 PM | Last Updated on Tue, Jun 20 2023 5:17 PM

Pm Modi To Meet Tesla Elon Musk In Us Tour - Sakshi

సుధీర్ఘకాలంగా భారత్‌లో కార్ల తయారీ, అమ్మకాలు చేపట్టాలని భావిస్తున్న టెస్లా నిరీక్షణకు తెరపడిందా? దేశీయంగా టెస్లా ఈవీ కార్ల కార్యకలాపాలు నిర్వహించేందు సీఈవో ఎలాన్‌ మస్క్‌కు ప్రధాని మోదీ అనుమతి ఇచ్చారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 20 నుంచి 25 వరకు అమెరికా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో దాదాపూ 8 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మోదీ.. టెస‍్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ను భేటీ కానున్నారు. 

2015లో తొలిసారి కాలిఫోర్నియాలోని టెస్లా ఫ్యాక్టరీలో ఎలాన్‌ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ భేటీ విజయవంతంగా ముగిసింది. ఈ క్రమంలో ఈవీ ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు మస్క్‌ భారత ప్రభుత్వంతో చర్చలు జరపడం.. అవి విఫలం కావడం, అదే సమయంలో మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవల్ని కేంద్రం అడ్డుకోవడం వంటి వరుస కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. 

మస్క్‌ ఇంటర్వ్యూ తర్వాత 
అయితే, ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎలాన్‌ మస్క్‌ను ఫైనాన్షియల్‌ జర్నలిస్ట్‌ థోరాల్డ్ బార్కర్ భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల మ్యానిఫ్యాక్చరింగ్‌ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. అందుకు మస్క్‌ ఓ ‘అబ్సల్యూట్లీ’. భారత్‌లో మా కార్యకలాపాలను త్వరలో ప్రారంభించబోతున్నాం. ఈ ఏడాది చివరి నాటికి అక్కడ (భారత్‌) మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను స్థాపించేందుకు స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు.  

ఆ తర్వాత టెస్లా ప్రతినిధులు బృందం భారత్‌కు వస్తున్నారని, ఈ పర్యటనలో భాగంగా టెస్లా ప్రతినిధులు ప్రధాని మోదీతోపాటు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ, టెస్లా ప్రతినిధులు భారత్‌కు రాక, ప్రధాని మోదీతో భేటీ అయ్యారా? లేదా? అనే విషయాలపై ఎలాంటి సమాచారం వెలుగులోకి రాలేదు. 

ఒప్పందం కుదుర్చుకునేలా
ఇక తాజాగా, అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ.. ఎలాన్‌ మస్క్‌తో భేటీ అవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ భేటీలో టెస్లా కార్ల తయారీ, విక్రయం, పన్ను, విడిభాగాల దిగుమతి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఒకవేళ టెస్లా ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే..ఇదే పర్యటనలోనే దీనిపై ఒప్పందం జరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

గతంలో ఏం జరిగిందంటే
గత ఏడాది కాలంగా ఎలాన్‌ మస్క్‌ భారత్‌ మార్కెట్‌పై ఆసక్తి కనుబరుస్తున్నారు. అయితే, చైనా నుంచి టెస్లా కార్లను దిగుమతి చేసి భారత్​లో అమ్మకాలు జరపాలని అనుకున్నారు. మస్క్‌ నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. టెస్లా ఇండియాలో ఎలక్ట్రిక్‌ కార్లను ఉత్పత్తి చేయాలనుకుంటే సమస్య ఏదీ లేదని, చైనా నుంచి మాత్రం కార్లను దిగుమతి చేయకూడదు అని అప్పట్లో కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు.

భారత్‌ తీరుతో మస్క్‌ అసంతృప్తి
ఆ తర్వాత భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్లను ఎప్పుడు ప్రారంభించనున్నారు అని ఓ ట్విట్టర్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు మస్క్‌ ఘాటుగా స్పందించారు. భారత్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్లా కార్ల మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్లను భారత్‌లో నిర్మించే ఆలోచన లేదు. మొదట మా కార్ల విక్రయాలు, సర్వీసులకు అనుమతించని ఏ ప్రాంతంలోనూ టెస్లా ఉత్పత్తి ప్లాంటలను నెలకొల్పబోదని మస్క్‌ ట్వీట్‌ చేశారు.

స్టార్‌లింక్‌పై వ్యతిరేకత
టెస్లా కార్ల తర్వాత శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని విషయంలో మస్క్‌ నిర్ణయం భారత్‌ తప్పుపట్టింది. సేవల కంటే ముందు బుక్సింగ్‌ ప్రారంభించిన స్టార్‌లింక్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. లైసెన్స్‌ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్‌ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్‌ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్‌. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్‌ ఇండియా డైరెక్టర్‌ పదవికి సంజయ్‌ భార్గవ రాజీనామా చేశారు.

మళ్లీ ఇప్పుడు
ఇలా వరుసగా భారత్‌లో తన సేవల్ని అందించాలన్న మస్క్‌ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో.. తాజాగా ప్రధాని మోదీ ఎలాన్‌ మస్క్‌తో భేటీ చర్చాంశనీయంగా మారింది. అన్నీ సవ్యంగా జరిగితే త్వరలో దేశీయ రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లు రయ్‌..రయ్‌ మంటూ చక్కెర్లు కొట్టనున్నాయని పరిశ్రమ వర్గాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

ఎవరెవరిని కలవనున్నారు?
చైనాపై నిఘూ పెంచేందుకు అగ్రరాజ్యం నుంచి 200 నుంచి 300 కోట్ల డాలర్ల విలువైన 30సీ గార్డియన్‌ డ్రోన్ల కొనుగోలు, ఆర్ధిక సంక్షోభం వంటి పరిణామాలు, వాటిని అధిగమించేలా సహాయ సహకారాల్ని అన్వేషించడమే లక్ష్యంగా చేస‍్తున్న అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన రెండు డజన్ల మంది ప్రముఖుల్ని కలవనున్నారు. వీరిలో ఎలాన్‌ మాస్క్‌తో పాటు నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

చదవండి👉ఎలాన్‌ మస్క్‌ ఖాతాలో ప్రపంచంలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement