ముంబై: విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ తాజాగా బెంగళూరులో తమ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్ (ఐఈసీ)ని ప్రారంభించింది. దాదాపు రూ. 295 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 50 మంది పైగా సిబ్బంది ఉండగా, వచ్చే నాలుగేళ్లలో 450 మందిని తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.
ప్రాట్ అండ్ విట్నీ ఇండియా కేపబిలిటీ సెంటర్, కోలిన్స్ ఏరోస్పేస్ సెంటర్‌తో పాటు అమెరికా, కెనడా తదితర దేశాల్లోని కార్యాలయాలతో ఐఈసీ కలిసి పనిచేయనుంది. దేశీయంగా పటిష్టమైన ఏరోస్పేస్ వ్యవస్థను నిర్మించడంపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ హంట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment